Harish Rao vs Sajjanar: ఫోన్ ట్యాపింగ్ చట్టబద్దమా కాదా అనేది కోర్టులు నిర్ణయిస్తారు.. సిట్ కాదు..
- సజ్జనార్ ట్వీట్‌కు హరీష్‌రావు కౌంటర్..
- కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్‌ను అక్రమం అని ఎలా ప్రకటిస్తారు?..
- దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం సిట్ చీఫ్‌కు లేదు..
- పోలీసులు దర్యాప్తు చేయాలి, తీర్పు చెప్పే హక్కు లేదు..
- ఫోన్ ట్యాపింగ్ చట్టబద్దమా కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలి: హరీష్‌రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao vs Sajjanar: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ చీఫ్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. కోర్టు తీర్పు లేకుండానే ఫోన్ ట్యాపింగ్‌ను “అక్రమం” అని సజ్జనార్ ఎలా ప్రకటిస్తారు? అని హరీష్ రావు ప్రశ్నించారు. దర్యాప్తు దశలోనే తీర్పు చెప్పే అధికారం SIT చీఫ్‌కు లేదు న్యాయస్థానం నిర్ణయం వచ్చే వరకు ఆరోపణను నేరంగా పరిగణించరాదు అని సూచించారు. రాజ్యాంగ సూత్రం పోలీసులు దర్యాప్తు చేయాలి, తీర్పు చెప్పే హక్కు లేదు ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమా కాదా అనేది కోర్టు మాత్రమే నిర్ణయించాలి.. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 5(2), ఐటీ యాక్ట్, PUCL తీర్పు ప్రకారం పరిశీలన అవసరం అధికారిక సందేశాల్లో “అక్రమ ట్యాపింగ్” పదప్రయోగం పాక్షికతకు నిదర్శనం SIT చీఫ్ ముందే అభిప్రాయం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తోంది అని హరీష్ రావు ఆరోపించారు.
Read Also: Fishermen: బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలై విశాఖ చేరుకున్న మత్స్యకారులు..
Also Read
అయితే, ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహారం మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ పై కేసులో సిట్ ఛీఫ్ సజ్జనార్ భాష పలు అనుమానాలకు తావిస్తుంది అని హరీష్ రావు అన్నారు. దర్యాప్తు న్యాయంగా ఉండటమే కాదు, న్యాయంగా కనిపించాలి అన్నారు. సుప్రీం కోర్టు ముందస్తు తీర్పులు ప్రజల న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. పోలీస్ ప్రకటనల ద్వారా రాజకీయ కథనాలు సృష్టించడం అనుచితం కోర్టులే తీర్పు చెప్పాలి అని వెల్లడించారు. పోలీస్ సందేశాలు కాదు రాజ్యాంగ పరిమితులు దాటితే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
తాజావార్తలు
-
Common Pass : హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్
-
Flydubai: పైలట్ స్మిత్ మచ్చర్ ఆరోగ్యంపై భారత ఎంబసీ కీలక ప్రకటన
-
Flydubai Attack: విమానాన్ని కూల్చాలనుకున్న ఒమన్ పైలట్.. ఇజ్రాయిల్‌కు అప్పగింతపై ట్విస్ట్!
-
Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?