సంక్రాంతి సంబరాల్లో ఉన్న తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త చెప్పింది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన ‘సన్న వరి ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 బోనస్’ పథకానికి సంబంధించి పౌరసరఫరాల శాఖ తాజాగా నిధులను విడుదల చేసింది. పండుగ పూట రైతుల ఖాతాల్లోకి ఈ బోనస్ సొమ్ము చేరుతుండటంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. Snapchat Offer : స్నాప్చాట్ Storage టెన్షన్ ఇక లేదు.! Subscription లేకుండా Memory సేవ్.! సన్న రకం ధాన్యం…
తెలంగాణ రాష్ట్ర ప్రగతి చక్రం పదిన్నర లక్షల మంది ఉద్యోగుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సచివాలయంలో జరిగిన ఉద్యోగ సంఘాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి అమలు చేసే అసలైన సారథులు ఉద్యోగులేనని స్పష్టం చేశారు. కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు మారినంత మాత్రాన వ్యవస్థ మారదని, గత ప్రభుత్వం ఒత్తిడి పెట్టి ఉద్యోగుల చేత తప్పుడు నిర్ణయాలు అమలు చేయించిందని ఆయన ఆరోపించారు. అయితే తమ…
తెలంగాణ రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న ప్రాజెక్టులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం తన అభ్యంతరాలను అత్యున్నత న్యాయస్థానంలో బలంగా వినిపించబోతోందని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు ఈ అంశంపై ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తూ, సుప్రీంకోర్టు స్వయంగా ఇచ్చిన సూచనల…
ఖమ్మం జిల్లాలో భారీ సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు. ఆరుగురు ప్రధాన నిందితులు అరెస్ట్ అయ్యారు. సైబర్ క్రైమ్ ద్వారా 547 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించిన సత్తుపల్లి ప్రాంతానికి చెందిన నిందితులు. సైబర్ క్రైమ్ లో సత్తుపల్లి,కల్లూరు,వేంసూర్ మండలానికి చెందిన ఆరుగురు ప్రధాన నిందితులుగా ఉన్నారు. పోట్రు మనోజ్ కళ్యాణ్,ఉడతనేని వికాస్ చౌదరి,పోట్రు ప్రవీణ్,మేడ భానుప్రియ, మేడా సతీష్,మోరంపూడి చెన్నకేశవ అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. Also Read:Star Villains :…
సంక్రాంతి వేడుకల్లో పతంగులు ఎగరేయడం ఒక భాగం. చిన్నా పెద్దా అంటూ తేడా లేకుండా కైట్స్ ఎగరేస్తూ ఖుష్ అవుతుంటారు. అయితే ఈ పతంగులు ఎగరేసే క్రమంలో ప్రమాద భారిన పడి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. కరెంట్ షాక్ తో, బిల్డింగ్ పై నుంచి పడి మృత్యువుని కొనితెచ్చుకుంటున్నారు. ఇదే కాకుండా చైనా మాంజా పీకలు కోస్తోంది. మనుషులతో పాటు, పక్షులను కూడా హరిస్తోంది. బైకులపై వెళ్తున్న వాహనదారుల మెడలకు తగిలి తీవ్రంగా గాయపరుస్తోంది.…
హనుమకొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలో కుక్కల మరణాలు చర్చనీయాంశంగా మారింది. శాయంపేట మండలంలో సుమారు 100 పైగా కుక్కు చంపి పాతి పెట్టిన అంశం పైనా శాయంపేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సర్పంచ్ ఎన్నికల హామీల్లో భాగంగా వీధి కుక్కలను హతమార్చి పాతిపెట్టిన సర్పంచ్ ల పై కేసులు నమోదు చేశారు. శాయంపేట, ఆరేపల్లి రెండు గ్రామాల పరిధిలో ఘటన చోటుచేసుకుంది. రెండు గ్రామాల్లో 120కి పైగా వీధి కుక్కల ప్రాణాలు బలి…
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఆ ఎమ్మెల్యేలు జనం సమస్యల్ని పక్కన పెట్టి సొంత వ్యవహారాల మీదే ఫోకస్ పెంచుతున్నారా? భూములు, ఇతర అడ్డగోలు దందాలతో అనుచరులు చెలరేగిపోతున్నా…. శాసనసభ్యులకు తెలియడం లేదా? లేక తెలిసి కూడా… మనోళ్ళే కదా…. మన పవర్ని వాళ్ళు కూడా అనుభవిస్తే, వసూలు చేసుకుంటే తప్పేంటని భావిస్తున్నారా? ఎవరా ఎమ్మెల్యేలు? ఏంటా తేడా వ్యవహారాలు? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యవహారాలపై తీవ్ర స్థాయి ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన…