Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలాంటి స్పష్టమైన విధానం లేకుండా, కేబినెట్ అనుమతి కూడా లేకుండా కొందరికే ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు ఇచ్చారని, ఆ వివరాలన్నింటిని త్వరలో ప్రజల ముందుంచుతామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పూర్తి పారదర్శకతతో కొత్త ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. పరిశ్రమలను ORR వెలుపలికి తరలించడం, హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడం,…
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 27న ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పోలింగ్‌కు పదిహేను రోజుల సమయం ఉంది. డిసెంబర్ 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల…
Kadiyam Srihari: నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సన్నాక సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు.. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం.. మరోవైపు, స్పీకర్ గడ్డం ప్రసాద్.. పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యేల వివరణ తీసుకుంటున్న సమయంలో.. తన రాజీనామాపై జరుగుతోన్న ప్రచారంపై స్పందించిన కడియం శ్రీహరి.. నేను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేశారు.. అయితే, స్పీకర్ నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ఉంటుందని.. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల…
కార్పొరేషన్ ఛైర్మన్స్‌గా ఇన్నాళ్ళు కూల్ కూల్‌గా పొజిషన్ ఎంజాయ్ చేసిన ఆ నేతలకు ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుందట. అదనంగా దక్కిన పోస్ట్ వాళ్ళని కంగారు పెడుతోందట. ఉన్నదానికి అదనంగా మరో పదవి దక్కితే ఇంకా హ్యాపీగా ఫీలవ్వాల్సిన నాయకులు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఎవరా నాయకులు? ఎందుకా కంగారు? తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడో కొత్త టెన్షన్లో ఉన్నారు. అనూహ్యంగా ఓ పదవి వచ్చిందిగానీ… దాని దెబ్బకు ఉన్న పోస్ట్ ఊడుతుందా ఉంటుందా? అంటూ చాలామంది…
Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని పేదలను నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడు. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్ పై బాధితులు ఆరోపణలు చేస్తున్నారు.
Shamirpet: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్‌పై దారుణ సంఘటన జరిగింది. ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, డ్రైవర్ సజీవదహనమైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
DGP Shivadhar Reddy : తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలను అణిచివేయడానికి ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యలు, నిరంతర ఆపరేషన్లు వేగంగా ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా మరో భారీ లొంగుబాటు చోటుచేసుకుంది. మొత్తం 37 మంది మావోయిస్టులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ వివరాలను వెల్లడించారు. డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం చేసిన పిలుపుతో మావోయిస్టులు బయటికి వస్తున్నారని చెప్పారు. శాంతియుత…