వివాదాలకు కేరాఫ్ అని పేరుబడ్డ ఆ తెలంగాణ మంత్రిలో రియలైజేషన్ మొదలైందా? లేక తన పరిధులేంటో తెలిసి వచ్చిందా? గతంలో కయ్యానికి కాలు దువ్విన మినిస్టర్… తాజాగా నేను నా మంత్రిత్వ శాఖ అని మాత్రమే మాట్లాడటానికి కారణం ఏంటి? జ్ఞానోదయం అయిందా? లేక కొత్త ఏడాదిలో వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా? ఎవరా మంత్రి? ఏంటా కథ? ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే మంత్రి కొండా సురేఖ తీరు ఎక్కువగా వివాదాస్పదం…
HYDRAA : హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (HYDRAA), మియాపూర్ ప్రాంతంలో అత్యంత విలువైన భూమిని కాపాడింది. మియాపూర్ విలేజ్ పరిధిలోని మక్తా మహబూబ్‌పేటలో సాగుతున్న భారీ కబ్జా యత్నాలను హైడ్రా అధికారులు భగ్నం చేశారు. తాజాగా చేపట్టిన ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఈ భూమి విలువ 3 వేల కోట్ల రూపాయలకు…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. పల్లెల్లో, పట్టణాల్లో ముగ్గుల పోటీలతో సందడి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పూడూరు – కిష్టాపూర్ డివిజన్ పరిధిలోని కె.ఎల్.ఆర్ (KLR) ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల కోసం భారీగా ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి, పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా…
Rajya Sabha: ఈ ఏడాది మార్చ్ నుంచి నవంబర్ మధ్య 73 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. ఇక, దీనిపై రాజ్యసభ సచివాలయం శుక్రవారం నాడు బులిటెన్ విడుదల చేసింది.
Traffic Alert: సంక్రాంతి సెలవులు వచ్చాయంటే చాలు సొంతూళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు పయనమవుతారు. ఈ క్రమంలో హైదరాబాద్- విజయవాడ రహదారిపై భారీగా వాహనాల రద్దీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లే వాహనాలు బారులు తీరాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ. 1.02 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు , వారి కుటుంబాలకు నేరుగా ప్రయోజనం చేకూరనుంది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క…
పిఠాపురం కమిషనర్‌పై పవన్ కల్యాణ్ సీరియస్.. నేను చీపురు పట్టి తుడవాలా..? డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు.. అయితే, స్థానిక అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పవన్.. పిఠాపురం మున్సిపల్ కమిషనర్‌తో పాటు డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం కమిషనర్ వ్యవహారశైలిని ఆయన తప్పుబట్టారు. కాలనీల్లో పేరుకుపోయిన చెత్త, అపరిశుభ్ర పరిస్థితులను చూసి పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలు ఇంత చెత్తగా…
ఆ లీడర్స్ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మారుతోందా? పొలిటికల్ సీన్లో కాస్త ఛేంజ్ కనిపిస్తోందా? పద్ధతులకు, పాలిటిక్స్‌కు లింక్ పెట్టొద్దన్న ఆనవాయితీని ఇద్దరూ కొనసాగిస్తున్నారా? తోలు తీస్తానని ఒకరు, ఉరి తీయాలని మరొకరు వీరావేశంతో ఇచ్చే స్టేట్మెంట్స్ను అక్కడికే పరిమితం చేయాలనుకుంటున్నారా? ఎవరా ఇద్దరు ముఖ్య నాయకులు? వాళ్ళ మధ్య సంప్రదాయాల ప్రస్తావన ఎందుకు వస్తోంది? ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు మాజీ ముఖ్యమంత్రి. రాజకీయంగా ఇద్దరూ గండరగండులే. తెలంగాణ పాలిటిక్స్‌లో కీలక పాత్ర పోషిస్తున్నవారే. సీఎం రేవంత్‌రెడ్డి,…
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా? కొత్త సీట్లలో పోటీ చేసేందుకు గులాబీ నాయకులు అల్రెడీ సిద్ధమైపోతున్నారా? వాళ్లకు అంత గట్టి భరోసా ఇచ్చింది ఎవరు? అధికారికంగా ఎక్కడా ఆ వాసనే లేని టైంలో… కారు పార్టీ నాయకులు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా మాట్లాడగలుగుతున్నారు? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉంది. అయితే… ఈసారి ఎలక్షన్స్ ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాల ప్రాతిపదికన జరుగుతాయా లేక పునర్విభజన చట్టంలో…