వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటీషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు బెయిల్ మంజూరు చేసింది. కానీ కొన్ని షరతులను ఈ సందర్బంగా కోర్టు సూచించింది. రూ.30 వేలు, ఇద్దరు పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ఇక షర్మిల విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తప్పనిసరని తెలిపింది.
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యారు. తీర్పును లంచ్ తర్వాత కోర్టు ఇవ్వనుంది. పోలీసులతో దురుసుగా వ్యవహరించారన్న కేసులో ఆమెను సోమవారం అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
రాయల తెలంగాణ అంశంపై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారమని.. రాయల తెలంగాణ అంశం వదిలి ఆ దిశగా ఆంధ్ర ప్రజలు ఆలోచించాలని కోరారు.
మన దేశంలో నదులను కూడా దేవతలుగా పూజిస్తారు. అందుకే పన్నెండేళ్ల కోసారి పుష్కరాల పేరుతో ఘనంగా వేడుకలను నిర్వహించి.. నదీమ తల్లిని పూజిస్తారు. పుష్కరాలతో పాటు కుంభమేళాను కూడా నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా కుంభమేళా సోమవారం ప్రారంభమైంది.
రాష్ట్రంలో సైబర్ నేరాల మినహా అన్ని రకాల నేరాలలో పూర్తిగా తగ్గుదలలో ఉన్నాయని డీజీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. కేవలం హైదరాబాద్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సైబర్ లిటరసీ గణనీయంగా పెరగడంతో పాటు సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని తెలిపారు.