ఇంచార్జీలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2017లో రాహుల్ గాంధీ సభ సంగారెడ్డి లో నిర్వహించానని ఆ సభ ఖర్చు అంత నాదే అంటూ వ్యాఖ్యానించారు సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి. ఆ గుర్తింపు ఎక్కడ పాయే అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో ముగించుకొని తెలంగాణ రాష్ట్రంలో మొదటి రోజు మహబూబ్ నగర్ జిల్లలో అడుగు పెట్టడం జరిగిందని, కొన్ని రోజుల తర్వాత రాహుల్ గాంధీ…
సిట్టింగ్లకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కాగా, ఎన్నికలపై నేతలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పని చేయాలి. లేకుంటే ఓడిపోతామని,…
CM KCR: వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తామని, అందరూ జాగ్రత్తగా పనిచేయాలని లేదంటే నేను ఏమీ చేయలేనని సీఎం కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో మాట్లాడుతూ.. మీరు బాగా పని చేసుకుంటే టికెట్లు మీకే అన్నారు.
DGP Anjani Kumar: సైబర్ నేరాల నివారణకు, సైబర్ భద్రతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు వినూత్నమైన పటిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు.
ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీతో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు కురవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతన్నలు కన్నీరుమున్నీరయ్యారు. చేతికి వచ్చిన పంట వర్షాలకు దెబ్బతినడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.