రాజధాని నగరం సహా తెలంగాణలోని అన్ని జిల్లాలను వరుణుడు ముంచేశాడు. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ ఉదయం కూడా పలు చోట్ల వాన పడుతోంది. ఒకవైపు జిల్లాల్లో తీవ్రస్థాయిలో పంట నష్టం జరగ్గా.. మరో వైపు హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయిన వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో వాతావరణం మారింది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసాయి.
Off The Record: రాయల తెలంగాణ…ఈ మాట వినపడి చాలా ఏళ్ళయింది కదా..? తొమ్మిదేళ్ళ క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన టైంలో రాయలసీమ నేతల నోళ్లలో బాగా నానిన పేరది. మళ్ళీ ఇన్నాళ్ళకు… ఆ ప్రస్తావన తీసుకువచ్చారు సీమకు చెందిన సీనియర్ లీడర్ జేసీ దివాకర్‌రెడ్డి. సడన్‌గా ఇన్నేళ్ళ తర్వాత ఆయనకు రాయల తెలంగాణ ఎందుకు గుర్తుకు వచ్చిందన్న చర్చ జోరుగా జరుగుతోంది. వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచిన నాయకుడు జేసీ. అంతకు మించి…
Union Home Ministry: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై బుధవారం కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహిస్తోంది. తొమ్మిదేళ్లుగా ఒకే ప్రాంగణంలో ఏపీ, తెలంగాణ భవన్లో కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా 58:42 నిష్పత్తి పద్ధతిలో గదుల విభజన, నిర్వహణ సాగుతోంది. ఏపీ ప్రభుత్వం తరఫున ఆదిత్యనాథ్ దాస్, రావత్, ప్రేమ చంద్రారెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత, విభజన చట్టం అమలుపై కేంద్ర హోంశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది.…
హైదరాబాద్‌లో దంచి కొడుతున్న వాన హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం మేఘావృతమైన వాతావరణం తర్వాత.. నగరంలోని అనేక ప్రాంతాలలో ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వర్షం కురిసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. లక్డీకాపూల్, బేగంపేట్, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, కూకట్పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరికొన్ని గంటల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పలుచోట్ల…
తిరుమలలో హెలికాప్టర్లు చక్కర్లు తిరుమల కొండలపై హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది.. నో ప్లై జోన్ అయిన తిరుమల కొండల మీదుగా ఓకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడం చర్చగా మారింది.. తిరుమలలోని శ్రీవారి ఆలయానికి సమీప ప్రాంతం మీదుగా హెలికాప్టర్లు వెళ్లడాన్ని అధికారులు గుర్తించారు.. ఈ దృశ్యాలను తిరుమలలోని భక్తులు కూడా వీక్షించారు.. నో ప్లై జోన్లో.. అది కూడా ఒకేసారి మూడు హెలికాప్టర్లు వెళ్లడంపై ఆందోళన వ్యక్తం చేశారు.. అయితే, ఆ మూడు హెలికాప్టర్లు…
ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభలు జరగుతున్నాయి. సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభలో ఆయన ప్రసంగించారు. గులాబీ నీడ కింద చల్లగా ఉన్నామంటే దానికి కారణం కేసీఆర్ అని నేతలకు మంత్రి సూచించారు.