ఖమ్మం జిల్లా కల్లూరులో బీఅర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో వైద్య,ఆరోగ్య,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రసంగించారు. బీజేపీ వాళ్లు తెలంగాణలో గెలుస్తాం అని మాట్లాడుతున్నారని.. కానీ ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు కాదు కదా.. డిపాజిట్ కూడా రాదన్నారు. జిల్లాలో డిపాజిట్ రాని పార్టీ రాష్ట్రం లో అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నించారు.
ఇందిరాపార్క్ వద్ద దీక్షకు బయలుదేరిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. లోటస్ పాండ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. సొంత పనులకు కూడా బయటకు రాకుండా అడ్డుకుంటారా? తనను హౌస్ అరెస్ట్ చేయడానికి పోలీసులకు ఏమి అధికారం ఉందని షర్మిల పోలీసులను ప్రశ్నించారు.
రాష్ట్రంలో అనుకోకుండా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు తీసుకెళ్తే.. ప్రభుత్వం కొనేలోపే ఇలా వర్షాలు రావడం వల్ల వర్షపు నీరు రైతుల కళ్లలో కన్నీరుగా మారుతోంది.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టిజన్లు ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నారు. ఈ సమ్మెకు రెండు సంఘాలు మద్దతు తెలుపుతుండగా.. కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. సమ్మెకు తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్-82)తో పాటు మరో సంఘం మద్దతు ప్రకటించాయి. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్(హెచ్-82) ప్రధాన కార్యదర్శి సాయిలును ఎస్మా కింద పంజాగుట్ట పోలీసులు శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు తెలిసింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను బ్రిటీష్ ఎంపీ వీరేంద్ర శర్మ అభినందించారు. హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు.