తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే నదీ జలాల కోసం….బీడు భూములను సాగులోకి తెచ్చుకోవడం కోసం… మా రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తై., నీటి కేటాయింపులు జరిగిన తర్వాతే మిగులు జలాల అంశం తేల్చుకోవాలి. వరద జలాలపై ఇరు రాష్ర్టాల వాటా తేలిన తర్వాతే ప్రాజెక్టులు కట్టుకుంటే న్యాయ బద్ధంగా ఉంటుంది. నీటి వాటాలను తేల్చాల్సిన బాధ్యత కేంద్రానిది… రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం… ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్,…
సాగునీటిపై హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మరో కుట్రపన్నుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయాల కోసం రైతుల మీద పగ ప్రతికారాలు తీర్చుకుంటుంది.. కాళేశ్వరం ప్రాజెక్టుకు వచ్చిన వరదను సముద్రంలోకి వదులుతుంది.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి లక్షల క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేస్తుంది.. నంది మేడారం పంప్ హౌస్ నుంచి మానేరుకు నీరు విడుదల చేసే అవకాశం ఉన్న చేయట్లేదు..…
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయి. మరో రెండ్రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో నేటి నుంచి వాజేడు బొగత జలపాతం పర్యాటకుల సందర్శన నిలిపివేశారు అధికారులు. గత రెండు రోజులుగా పెనుగోలు గుట్టల పై ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు బొగత జలపాతం ప్రమాద స్థాయి దాటి ప్రవహించడంతో బోగత జలపాతం సందర్శన నిలిపివేసిన అధికారులు. అదేవిధంగా రానున్న రెండు రోజులలో వాతావరణ శాఖ…