Vemulawada: వేములవాడ రాజన్న క్షేత్రంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. సుమారు 11 రోజుల పాటు భక్తులకు ప్రతి రోజు ఒక్కో అవతారంలో, ఒక్కో అలంకారంలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఇక, స్వామివారి కల్యాణ మండపంలో స్వస్తి పుణ్యాహవాచనంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో రాజేశ్వరి దేవి దర్శనం ఇవ్వనుంది.
Read Also: Head Constable Help Students: హ్యాట్సాఫ్ వెంకటరత్నం.. మానవత్వం చాటుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్..
అయితే, వచ్చే నెల 1వ తేదీన అమ్మవారి తెప్పోత్సవం జరగనుంది. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి సందర్భంగా ఆయుధపూజ, అమ్మవారి అంబారి సేవపై పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు కొనసాగనుంది. ఈ 11 రోజుల పాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేసినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.