దేశ విదేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం ఎంతో ప్రయత్నిస్తున్నాం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశీ సంస్థలను ప్రోత్సహించిన తాము.. ఈ దేశ, రాష్ట్ర సంస్థలను ఎందుకు ప్రోత్సహించమో జర ఆలోచించాలన్నారు. మిమ్మల్ని (రాష్ట్ర సంస్థలు) ఎందుకు వదులుకుంటాం అని, అపోహలు సృష్టించే వాళ్లతో ప్రయాణిస్తే ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలని, అప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత తనది…
రాయపర్తి మండలం మైలారం గ్రామ శివారు ఖమ్మం-వరంగల్ జాతీయ రహదారి (563)పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపుకు వెళ్తున్న బస్సుని వరంగల్ వైపు వస్తున్న లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25మందికీ ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్ లో సుమారు 44 మంది ప్రయాణికులు వున్నట్టు ప్రాథమిక సమాచారం. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని…
2025 స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఒకే వేదికపై రాజకీయ ప్రత్యర్థులు కలిశారు. పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు.. బీజేపీ ఎంపీ డీకే అరుణలు ఒకే వేదికపై కనిపించారు. గతంలో ఈ ఇద్దరూ కాంగ్రెస్ కేబినెట్లో మంత్రులుగా పనిచేశారు. జెండా ఆవిష్కరణ, ప్రోటోకాల్ విషయంలో పలు సందర్భాల్లో ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగాయి. ఈరోజు మంత్రి హోదాలో జూపల్లి మహబూబ్ నగర్లో జెండా ఆవిష్కరణ చేయగా.. ఎంపీ హోదాలో డీకే…
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన అని, దీనికి చరిత్రే సాక్ష్యం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ.. తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్గా నిలబెట్టాం అని చెప్పారు. ద్విముఖ విధానంతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. తమ ఆలోచనలో స్పష్టత ఉందని, అమలులో పారదర్శకత ఉందన్నారు. అందరినీ కలుపుకుని, అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని తాము ఎంచుకున్నాం అని…
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్రంగా వాడుకుంటున్నాయని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుసినప్పుడు గతంలో పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి భేరీజు వేడుకోండన్నారు. ఎంత భారీ వర్షం పడినా గంటా, రెండు గంటల వ్యవధిలోనే ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించి.. వరద నీటిని మళ్లించడంలో హైడ్రా బాగా పని చేస్తోందని ప్రశంసించారు. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్థవంతంగా పని చేస్తోందన్నారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్…
Rohith Reddy Denies Party Switching Rumours: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఖండించారు. గువ్వల బాలరాజును తానే బీజేపీలోకి పంపినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇంకా కొంతమంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి తాను వెళ్తున్నట్లు వస్తున్న వార్తలు హాస్యాస్పదం అని పేర్కొన్నారు. సొంత పనుల మీద అమెరికా వచ్చానని, త్వరలోనే తాండూరు వస్తా అని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్…