వర్షం దాటికి రెండు వేర్వేరు గ్రామాలలోని పాఠశాలల్లో ఆ భవనాలకు సంబంధించి పెచ్చులు ఓవైపు, వర్షపునీరు మరోవైపు.. కిందపడుతోంది.. పెచ్చులు ఊడుతుండడంతో ఆ భవనం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి.. భయంతో స్కూల్‌కు రావాలంటేనే విద్యార్థులు వణికిపోతుంటూ.. ఒక గ్రామానికి చెందిన పాఠశాల పిల్లలను పీర్ల కొట్టానికి (ముస్లింలు పీర్లను పెట్టే ప్రదేశం) సంబంధించిన రేకుల షెడ్డులో పాటలు చెబుతుంటే.. మరో గ్రామంలో గణేష్ మండపంలో పాటలు చెబుతున్నాడు ఉపాధ్యాయులు.
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత 15 రోజుల్లో టమాటా ధర డబుల్ అయిపోయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా 60 నుంచి 70 రూపాయలు పలుకుతుంది.
డామిట్ కథ అడ్డం తిరిగింది. ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చేందుకు భార్య పన్నిన కుట్ర బెడిసి కొట్టింది. దీంతో పోలీసులు ఆమెతోపాటు ప్రియున్ని అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన వరంగల్‌లో వెలుగులోకి వచ్చింది. వరంగల్‌లోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజు అనేవ్యక్తిపై ఆగస్టు 14న రాత్రి హత్యాయత్నం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు అతన్ని పోతననగర్ డంపింగ్ యార్డ్ సమీపంలో అత్యంత కిరాతకంగా చిత్ర హింసలు పెట్టి దాడి చేశారు. అతను చనిపోయాడనుకొని అక్కడే…
Vehicle Life Tax : తెలంగాణ ప్రభుత్వం వాహనాలపై లైఫ్‌టాక్స్ పెంచింది. ఆగస్టు 14 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. రవాణా, రోడ్లు-భవనాల శాఖ జారీ చేసిన జీఓ నెం.53 ద్వారా మోటార్ వాహనాల పన్ను చట్టం, 1963లోని షెడ్యూల్స్‌లో మార్పులు చేసింది. ఈ మేరకు రెండు, మూడు, నాలుగు చక్రాల నాన్-ట్రాన్స్పోర్ట్ వాహనాలకు పెరిగిన లైఫ్‌టాక్స్ వసూలు చేయనుంది. తాజా నిర్ణయం ప్రకారం, రూ.50 వేలు లోపు ధర కలిగిన రెండు చక్రాల వాహనాలపై…
తెలంగాణలో కుల గణనను పగడ్బంధీగా నిర్వహించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రవీంద్రభారతిలో సర్వాయి పాపన్న విగ్రహ స్థాపన శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా కుల గణనను పూర్తి చేశామని, వందకు వంద శాతం సరిగ్గా లెక్కలు నమోదయ్యాయని తెలిపారు.