HYDRA Commissioner: హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో క్లౌడ్ బరెస్ట్ జరుగుతుంది అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మొన్న కుత్బుల్లాపూర్ లో 18 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం హైదరాబాద్ లో కురస్తుందన్నారు. నగర శివారులో కన్నా నగరంలో ఎక్కువ ఎండ కొడుతుంది.. ఈ ఎండ వల్ల జెనరేట్ అయిన హీట్ తో ఇక్కడ ఎక్కువ వర్షాపాతం నమోదు అవుతుంది అని తెలిపారు. కాబట్టి, అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ తో ఇలాంటి ఫ్లడ్ ను కంట్రోల్ చేయవచ్చు.. ఇందులో భాగంగా నాలాల పునరుద్దరణ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాబోయే 100 ఏళ్లకు అనుగుణంగా నాలా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.. నాలాల విషయంలో కబ్జాలను అరికటాల్సిన అవసరం ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
Read Also: Nitin Gadkari: బ్రాహ్మణులకు రిజర్వేషన్లు లేకపోవడం దేవుడు నాకిచ్చిన అతిపెద్ద వరం
అలాగే, నగరంలో కాంక్ట్రెట్ పెరగడంతో వర్షపు నీరు కూడా ఎక్కువగా ఇంకే అవకాశం లేదని ఏవీ రంగనాథ్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు డిజస్టర్ మేనేజ్మెంట్ కోసం 51 టీమ్స్ ఉన్నాయి.. వాటిని 71 DRF టీమ్స్ కు పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. ఇంకా నాలాల్లో డీ సిల్టింగ్ కూడా చాలా ముఖ్యమైంది.. అందుకోసం డీ సిల్టింగ్ కు హైడ్రా పెద్ద పీట వేయాలని నిర్ణయించాం.. నాలాల్లో మొన్న ముగ్గురు కొట్టుకుపోయారు.. అందులో ఒక్కరి బాడీ వలిగొండలో దొరికింది.. మిగతా వారి కోసం హైడ్రా తీవ్రంగా శ్రమించింది అని గుర్తు చేశారు. అయితే, ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడంతో ఇంకా దొరకలేదు.. గేట్లు కూడా తెరవడంతో ఎక్కడో ఓ చోట దొరికే అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ తెలిపారు.
Read Also: Mother K*lls Son: భూ వివాదం.. కన్న కొడుకును చంపిన తల్లి.. కంట్లో కారం చల్లి, చీరతో ఉరివేసి..!
ఇక, కబ్జాలను కూడా హైడ్రా కాపాడుతుంది అని రంగనాథ్ తెలిపారు. ఇప్పటి వరకు 581 ఎంక్రోచ్మెంట్ల నుంచి 923.14 ఎకరాల స్థలాన్ని కాపాడాం.. వీటి విలువ 45 వేల నుంచి 50 వేల కోట్లు ఉంటుంది.. నిన్న కూడా గాజుల రామారంలో కబ్జాలో ఉన్న నిర్మాణాలు కూల్చివేశాం.. అందులో కేవలం ఖాళీగా ఉన్న ఇండ్లను మాత్రమే కూల్చాము.. 621 ఇండ్లల్లో ప్రజలు ఉండడంతో ఆ ఇళ్లను కూల్చలేదన్నారు. అయితే, గాజుల రామారంలో ఎవ్వరికి టైం ఇవ్వలేదు.. హైడ్రా ఎవరి ఇంటికి కరెంటు కట్ చేయలేదు.. నివాస గృహలను ఎక్కడ కూడా కూల్చివేతలు చేపట్టలేదన్నారు. గాజుల రామారం గతంలో రెవిన్యూ వాళ్ళు అనేక సార్లు నోటీసులు ఇచ్చారని ఆయన వెల్లడించారు. కొందరు స్థానిక రౌడీ షీటర్లు కబ్జా చేసి, చిన్న చిన్న గదులు నిర్మించి అందులో పేదవారిని ఉంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వారికి ఎదురు డబ్బులు ఇస్తూ ఆ ఇళ్లల్లో ఉంచుతున్నారు.. కొందరు డబ్బులు పెట్టి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు.. వాళ్ళు ముందుకొచ్చి ఎవరి నుంచి కొన్నారో చెబితే.. వారికి న్యాయం చేయడానికి హైడ్రా సిద్ధంగా ఉందని రంగనాథ్ వెల్లడించారు.
అయితే, సోషల్ మీడియాలో ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ప్రజలు సోషల్ మీడియా విషయంలో అప్రమతంగా ఉండాలని సూచించారు. సోషల్ మీడియాపై మాట్లాడాలని అనుకువడం లేదన్నారు. వర్టేక్స్, వాసవి విషయం లో హైడ్రా కుమ్మకైందనీ చాలా మంది అంటున్నారు.. హైడ్రా కుమ్మకైతుందా అని ఎక్కడైనా ఎంక్వయిరీ చేసుకోచ్చు అని సవాల్ విసిరారు. వార్టెక్స్ పై మొదట కేసు పెట్టింది హైడ్రా.. ముసాపేట్ లో నాలా ఎంక్రోచ్ చేస్తే వాసవిపై కూడా కేసు పెట్టామన్నారు. అలాగే, ఫాతిమా కాలేజ్ సల్కం చెరువు ప్రిలిమినరి నోటిఫికేషన్ చేస్తున్నాం.. ఫైనల్ ప్రిలిమినరి నోటిఫికేషన్ పూర్తి అయ్యాక ఏం చేయాలో చేస్తామన్నారు ఏవీ రంగనాథ్.