Heavy Rains: వందంటే వర్షం.. కురుస్తోంది.. కుండతో పోసినట్టు.. ఆకాశానికే చిల్లు పడిందా.. మేఘాలు పగిలి ఒకేసారి పడిపోయాయా అనే విధంగా వర్షాలు పడుతున్నా్యి. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. అత్యధికంగా యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 13 సెంటీమీటర్ల వాన కురిసింది. జనగామ జిల్లా దేవరుప్పలలో 12 సెం.మీ వర్షపాతం రికార్డయింది. మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌లో 10 సెం.మీ వాన కొట్టింది. మేడ్చల్ జిల్లా కీసరలో 10 సెం.మీ, మహబూబాబాద్ జిల్లా వడ్డేకొత్తపల్లిలో 9.5 సెం.మీ రికార్డయింది. వరంగల్ జిల్లా కల్లెడలో 9.5 సెం.మీ, జనగామ జిల్లా కొడకండ్లలో 9 సెం.మీ, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 8 సెం.మీ వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా నాదర్‌గూల్‌లో 10 సెం.మీ వర్షం పడింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్‌లో 9 సెం.మీ మేడ్చల్ జిల్లా కాప్రాలో 7 సెం.మీ, ఉప్పల్‌లో 6 సెం.మీ, మల్కాజ్‌గిరిలో 5 సెం.మీ వాన పడింది. మౌలాలిలో 4.5, అల్వాల్‌లో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Read Also: Telangana Govt: సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా.. ఒక్కో కార్మికుడికి లక్షల్లో బోనస్
కొమురంభీం జిల్లాలోనూ వరద బీభత్సం సృష్టించింది. తిర్యాణి మండలం ఉల్లి పిట్ట గ్రామంలో లెవెల్ వంతెన పైనుంచి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండటంతో… ఉల్లిపిట్ట, డోర్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు మహిళ మృతిచెందింది. పెండల్వాడ గ్రామంలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఆ సమయంలో పడింది. వ్యవసాయ పనుల్లో ఉన్న నిర్మల అనే మహిళపై అక్కడికక్కడే మృతి చెందింది. ఇవాళ కూడా అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కాగా, పగలంతా ఎండ.. సాయంత్రం అయ్యిందంటే చాలు.. డ్యూటీ ఎక్కినట్టుగా వరుణదేవుడు విజృంభిస్తున్నాడు.. వర్షాలు పడే సమయంలో.. అవసరం అయితే తప్ప బయటకు రావొద్దు అని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు..
ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఏపీ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణకేంద్రం తెలిపింది. ఆదివారం పల్నాడు జిల్లాలో భారీ వర్షం కురిసింది. నరసరావుపేట రోడ్డుపై వర్షపు నీరు ఆగింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నాగన్నకుంట జలదిగ్బంధంలో చిక్కుంది. వరద పెరుగుతుండటంతో.. నరసరావుపేట ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా యలమంచిలిలో భారీ వర్షం కురిసింది. వర్షానికి చెట్లు నేలకొరిగాయి. రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను మున్సిపాలిటీ అధికారులు తొలగిస్తున్నారు.