Minister Ponnam: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, సద్దుల బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది అని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు మనవాళ్లు చదువుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి ఆటంకంగా ఉన్నాయని పేర్కొన్నారు.
Read Also: CPL 2025: ఆధిపత్యాన్ని నిరూపించుకున్న ‘ట్రిన్‌బాగో నైట్ రైడర్స్’.. ఐదోసారి టైటిల్ కైవసం
ఇక, మన దేశానికి సంబంధించి 100 మంది సీఈఓలు ఇతర దేశాల్లో ఉన్నారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారి తెలివి తేటలను మన దేశంలో పెట్టాలని కోరుతున్నాను.. ఇక్కడి ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేసి కంపెనీలకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక, విదేశాల్లో ఉన్న తెలంగాణ వారంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అని కోరారు. గ్రామీణ ప్రాంతాలను పారిశ్రామికంగా సాంకేతికంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పొన్నం ప్రభాకర్ చెప్పారు.