ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అన్న మాధవరావు పాలిట కాలయముడయ్యాడు తమ్ముడు సాంబశివరావు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని చిరుతపల్లి గ్రామంలో మాధవరావుని గడ్డపారతో కొట్టి చంపాడు తమ్ముడు సాంబశివరావు.. అన్నదమ్ములిద్దరు ఘర్షన పడ్డారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన తమ్ముడు అన్నను గడ్డపారతో కొట్టి చంపాడు. అయితే వీరిద్దరి మధ్య గొడవలకు కారణం ఆస్తి తగాదాలే అని స్థానికులు చెబుతున్నారు.
Also Read:Dussehra Celebrations : ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు, భక్తుల సందడి, భారీ బందోబస్త్ మధ్య వేడుకలు
మాధవరావు మృతితో చిరుతపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని వివరాలు సేకరించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వెంటరాని ఆస్తుల కోసం గొడవపడి రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు అక్కా చెల్లెళ్లు కొట్టుకు చావడం పై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.