IMD Issues Red Alert for 4 Districts in Telangana: తెలంగాణ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మరో పదకొండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ…
MLC Kaviha Leaves Hyderabad to US: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమెరికాకు పయనం అయ్యారు. శనివారం ఉదయం పెద్ద కుమారుడు ఆదిత్య, చిన్న కుమారుడు ఆర్యతో కలిసి అమెరికాకు బయల్దేరారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవిత భర్త అనిల్, కుటుంబ సభ్యులు, తెలంగాణ జాగృతి నాయకులు సెండాఫ్ ఇచ్చారు. చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు కవిత అమెరికా వెళుతున్నారు. 15 రోజుల పాటు అమెరికా పర్యటనలో ఉండనున్నారు. ఎమ్మెల్సీ…
IMD Issues Orange Alert for Telangana Today: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జోరు వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నేడు కూడా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. భారత వాతావరణ విభాగం (ఐఎండీ)…
‘పదవులు మీకే.. పైసలూ మీకేనా’ అంటూ సీఎం రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. మునుగోడు నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్లకు, సీసీ రోడ్డు కాంట్రాక్టర్లకు ఒక్క రూపాయి నిధులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తనకు మంత్రి పదవి ఇవ్వనందుకు.. తన నియోజకవర్గ అభివృద్ధికి అయినా డబ్బులు ఇవ్వండి అని సీఎంను రాజగోపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరిలో నిర్వహించిన…