Harish Rao: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పామాయిల్ ఫ్యాక్టరీలో పామాయిల్ ఉత్పత్తికి సేకరించిన పంటను పరిశీలించారు. ఇక, ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీలో కాంగ్రెస్ పాత్ర ఆరో వేలు లాంటిది అన్నారు. మొదట్లో నర్మెట్టలో ఫ్యాక్టరీ పెట్టినప్పుడు సిద్దిపేట జిల్లా నర్మెట్ట, జనగామ జిల్లా నర్మెట్టనా అని కాంగ్రెస్ నేతలు వెతికారు.. అలాంటి వారు నేడు జేబులో కత్తెర పట్టుకుని ఎప్పుడెప్పుడు రిబ్బన్ కత్తిరిద్దాం అని తిరుగుతున్నారు.. ఈ కాంగ్రెస్ నాయకులు తీరు మందికి పుట్టిన పిల్లలను మా పిల్లలు అని ముద్దాడినట్టు ఉందని పేర్కొన్నారు. ఇక, ఈ ఫ్యాక్టరీ BRS హయాంలో వచ్చింది.. మా ప్రభుత్వ హయాంలోనే 75 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 25 శాతం పనులు కాంగ్రెస్ పార్టీ చేసింది.. ఒక వేళ ఈ ఫ్యాక్టరీ పనులు 75 శాతం కాకపోతే దీన్ని కూడా వేరే చోటికి తరలించేశారు హరీష్ రావు.