తెలంగాణలో జులై 1న నిర్వహించిన గ్రూప్-4 ఫలితాలపై టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. గ్రూప్-4 రిజల్ట్స్ కు ఇంకా సమయం ఉందని ఆయన పేర్కొన్నారు.
మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో నాలుగు రోజుల క్రితం బెల్లంపల్లి నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఇన్ చార్జీ వరప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరులు దాడి చేయడాన్ని బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు.
సీఎం కేసీఆర్ వరుసగా మూడోసారి రాజ్ భవన్ లో నిర్వహించే ఎట్ హోమ్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేతతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సైతం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఎట్‌హోమ్ ప్రోగ్రాంలో కనిపించకపోవడం గమనార్హం.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడిది చివరలో జరుగనున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కంటే చాలా ముందుగానే ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ్టి నుంచే హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన వారికి అందజేస్తామని వెల్లడించారు.