Congress: అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. ప్రకటన ఎప్పుడో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడిది చివరలో జరుగనున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తుంది. ఎన్నికల షెడ్యూల్ కంటే చాలా ముందుగానే ఎమ్మెల్యేల అభ్యర్ధులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ గాంధీ భవన్ లో సమావేశమైంది. ఎమ్మెల్యే అభ్యర్ధుల ఎంపిక విషయంలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలోని కమిటీ తీవ్రంగా చర్చించింది. పార్టీ టిక్కెట్లు ఆశించే వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Read Also: Harold Das: రూత్ లెస్ విలన్ గా అర్జున్.. రోలెక్స్ కనిపించాడు బ్రో
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
అయితే, జనరల్ అభ్యర్థులు రూ. 10 వేలు, ఇతర సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థుల నుంచి రూ.2500 ఫీజు వసూలు చేయాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 18వ తేదీ నుంచి టిక్కెట్లు ఆశించే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కాంగ్రెస్ అధిష్టానం స్వీకరించనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణలో అమలు చేయాలని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుంది. ముందుగానే పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించాలని చూస్తోంది. ఎలాంటి ఇబ్బందులు లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులను ముందుగా ప్రకటించేందుకు ప్లాన్ చేస్తుంది. అభ్యర్ధుల ఎంపికలో సర్వేలతో పాటు ఇతర అంశాలను కూడా ప్రామాణికంగా తీసుకుంటామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు.
Read Also: SBI:తలసరి ఆదాయంపై ఎస్‌బీఐ కీలక రిపోర్ట్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఇక, పార్టీ నాయకత్వానికి ఇబ్బందులు లేని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్ధుల పేర్లను ఈ నెల 17వ తేదీ తర్వాత ప్రకటిస్తే ఎలా ఉంటుందనే దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. ఇంకా ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే, ఈ నెల లాస్ట్ వరకు 40 మంది క్యాండిడెట్లను ఖరారు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ సన్నహాలు రెడీ చేస్తుంది. రిసెంట్ గా జరిగిన మీటింగ్ లో టిక్కెట్ల కోసం పోటీ లేని అసెంబ్లీ నియోజకవర్గాలపై పార్టీ స్క్రీనింగ్ కమిటీ నజర్ పెట్టింది. పోటీ పడే అభ్యర్థుల బలాబలాలపై పార్టీ అధిష్టానం చర్చిస్తుంది.
Read Also: Bindeshwar Pathak: సులభ్ వ్యవస్థాపకుడు మృతి.. సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని
అయితే, అభ్యర్థుల ఎంపికను పార్టీ సర్వే రిపోర్టుతో పాటు సామాజిక అంశాలను కూడా కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించే తొలి జాబితాలో బీసీ అభ్యర్ధుల పేర్లు ఉంటాయని తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు కనీసం 50 అసెంబ్లీ సీట్లు ఇవ్వాలని అడిగారు.. కానీ.. 50 సీట్లు ఇవ్వకపోయినా కనీసం 20 నుంచి 30 సీట్లు ఇస్తారని బీసీ వర్గానికి చెందిన కొందరు నేతలు అనుకుంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇందుకోసం ఇతర పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేస్తుంది. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్.. తెలంగాణలో గెలిచేందుకు సన్నాహాలు చేస్తుంది.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!