ప్రజా యుద్ధనౌక, గాయకుడు గద్దర్ నివాసానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లి.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రబాబు వెంట టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.
Pragati Bhavan: ప్రగతి భవన్లో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు.
తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతుల రూ.99,999 రుణాన్ని సీఎం కేసీఆర్ మాఫీ చేసినందుకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా.. రైతు సంక్షేమం విషయంలో తెలంగాణ సర్కార్ ఎక్కడా రాజీపడలేదన్నారు.
బతుకమ్మ సంబరాలకు భారత్ జాగృతి సన్నాహాలు మొదలు పెట్టింది. భారత్ జాగృతి ఆధ్వర్యంలో రాబోతున్న బతుకమ్మ పాటకు సంబంధించిన ఒక వీడియోను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-3 అభ్యర్థులకు మరో అవకాశం ఇచ్చింది. తమ అప్లికేషన్లలో ఉన్న వివరాలను సరిదిద్దుకునేందుకు ఎడిట్ అప్షన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిక్లరేషన్ పై అభిప్రాయాలను తీసుకోవడానికి గాంధీభవన్ కు మంద కృష్ణ మాదిగ బృందం వెళ్లింది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో పాటు పలువురు పార్టీ నేతలతో మంద కృష్ణ సమావేశం అయ్యారు. ఎస్సీలలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ నాయకులకు ఆయన వినతిపత్రాలు ఇచ్చారు.
కేసీఆర్ అవినీతి, అప్రజాస్వామిక, నిజాం నియంతృత్వ పాలనపై తెలంగాణ ఉద్యమం స్థాయిలో మరో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా మూడో దశ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.