స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 954 మంది పోలీసులకు పోలీస్ సేవా పతకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 229 మందికి పోలీసు గ్యాలంటరీ పతకాలు, 82 మందికి రాష్ట్రపతి విశిష్ఠ సేవా పతకాలు, 642 మందికి పోలీసు సేవా పతకాలు అందించనుంది. ఇక, తెలంగాణ రాష్ట్రం నుంచి 34 మంది ఎంపిక అయ్యారు.
హైదరాబాద్ నగర శివారులో మరో భారీ భూ వేలం పాటకు తెలంగాణ సర్కార్ సిద్ధం అయింది. మొకిలా ఫేజ్- 2 భూ వేలానికి హెచ్ఎండీఏ నేడ (సోమవారం) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని మొకిలా దగ్గర మూడు వందల పాట్ల అమ్మకానికి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నడిచిన నాయకులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి చెప్పుకొచ్చాడు.
కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ హాత్ సే హాత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు, యువకులు, మహిళలు పాల్గొని.. షబ్బీర్ అలీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్లుగా అధికార బీఆర్ఎస్.. ప్రజా సమస్యలను విస్మరించిందని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
గన్నవరంలో వైసీపీకి బిగ్ షాక్..! ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గన్నవరం పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.. మరోసారి గన్నవరం రాజకీయాలు తెరపైకి వచ్చాయి.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలేలా పరిస్థితి కనిపిస్తోంది.. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గన్నవరం నుంచి బరిలోకి దిగి.. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి అయిన వల్లభనేని వంశీ చేతిలో ఓటమిపాలైన యార్లగడ్డ వెంకట్రావు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. వల్లభనేని వంశీ.. టీడీపీకి…
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధి జడలు విప్పుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు లక్షణాలతో బాధితులు క్యూ కడుతున్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో నిత్యం 20-30 మంది డెంగీ లక్షణాలతో వెళ్తున్నారు.