స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పేద ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ్టి నుంచే హైదరాబాద్‌లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులైన వారికి అందజేస్తామని వెల్లడించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించిన ప్రసంగించారు. అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇళ్లులేని పేదలు ఉండకూడదనేది తమ లక్ష్యమని ఆయన అన్నారు.
Read Also: Nandita Swetha : స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెస్మెరైజ్ చేస్తున్న నందిత శ్వేతా..
గతంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన నివాసం చాలీచాలకుండా ఒకే ఒక్క ఇరుకు గది ఉండేది.. అందుకు భిన్నంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే విధంగా రెండు పడకగదులతో ఇండ్లు నిర్మించి ఉచితంగా ఇస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. దీన్ని ఒక నిర్విరామ ప్రక్రియగా ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను ఇవాళ్టి నుంచే తెలంగాణ సర్కార్ అర్హులైన పేదలకు అందజేస్తున్నది అని చెప్పారు.
Read Also: Bholaa Shankar: ‘భోళా శంకర్’పై మీమ్స్ వేస్తే గల్లంతే.. ఎందుకో తెలుసా?
ఇక, సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి మూడు దశల్లో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వనుంది. ముందుగా ప్రతీ నియోజకవర్గంలో 3 వేల మందికి ఈ పథకంలో ద్వారా డబ్బులు ఇవ్వనుంది. గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ను ప్రభుత్వం కల్పించిందని కేసీఆర్ పేర్కొన్నారు.