Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Headlines Top Headlines 9 Am On August 16th 2023

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Published Date :August 16, 2023 , 9:18 am
By Sudhakar Ravula
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

గర్భిణికి ఆపరేషన్‌.. కడుపులోనే కత్తెర వదిలేసి కుట్లు..
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వారం క్రితం కాన్పు కోసం ఓ గర్భిణీ మహిళ చేరింది.. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఆమెకు సిజేరియన్‌ చేసి, పండంటి బిడ్డను బయటకు తీశారు. అంత వరకు బాగానే ఉన్నా.. ఆపరేషన్‌ తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరిచిపోయారు. అయితే, అప్పటి నుంచి బాధితురాలు కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతోంది. దీంతో వైద్యులు ఎక్స్‌రే తీయించడంతో కడుపులో కత్తెర ఉన్న విషయం వెలుగు చూసింది.. ఈ ఘటనను బయటకు రాకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుండగా.. ఆ ఎక్స్‌రే ఫొటోను ఓ ద్యోగి తన ఫేస్‌బుక్‌, ట్విటర్‌ ఖాతాల్లో పోస్టు చేయడంతో.. ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది.. దీంతో, షాక్‌ తిన్న ఆస్పత్రి అధికారులు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆ పోస్టులను తొలగించాడు. మరోవైపు.. ఆస్ప త్రి రికార్డుల్లో బాధితురాలి వివరానలు కూడా మాయం చేశారని ఆరోపణలు వినిపిస్తు్న్నాయి.. దీనిపై వైద్యులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు.. మరోవైపు.. వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రోగులు.

జనగాంలో దారుణం.. మైనర్ బాలికల శరీరంపై కారం చల్లి..
చెన్నూరులో మధుకర్ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే వారి ఇంట్లో ఇద్దరు అమ్మాయిలను పనిచేయడానికి పెట్టుకున్నారు. రోజు రావడం మధుకర్ ఇంట్లో పనిచేయడం వంటి పనులు చేసుకునేవారు. అయితే 15 రోజలు క్రితం యజమాని మధుకర్ ఇంట్లో రూ.35వేల వరకు డబ్బులు మాయమయ్యాయి. మధుకర్ ఇంట్లో వారు ఆ ఇద్దరి అమ్మాయిలను అడగ్గా డబ్బులు తీయలేదని సమాధానం ఇచ్చారు. అయితే తీవ్ర ఆగ్రహానికి గురైన యజమాని మధుకర్ ఆ ఇద్దరు మైనర్ బాలికపై పైశాచికంగా వ్యవహరించాడు. పంచాయితీ కార్యాలయం వద్ద చెట్టుకు కట్టేసి కళ్ళలో కారం పెట్టి దొంగతం చేశారంటూ వేధించారు. దీంతో వారు లేదు దొంగతనం చేయలేదని, ప్రాధేయపడ్డా కనికరించాలేదు యజమాని. పైగా పంచాయితీ కార్యాలయం వద్ద చెట్టుకు కట్టేసిన అందరూ చూస్తు ఉండిపోయారే తప్పా ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వారిద్దరి శరీరంపై కారం చల్లి చితకబాదారు. ఓ బాలిక తల్లిదండ్రులను సైతం తీవ్రంగా కొట్టారు. స్థానిక సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎస్సై శ్రీకాంత్‌ను వివరణ కోరగా సమాచారం మాత్రం తెలిసిందని సమాధానమిచ్చారు. కేసు నమోదు చేసుకున్నామని, దొంగతనం జరిగిందా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే మరికొందరు మైనర్ బాలికలపై ఏంటీ ఈ అరాచకం అని మండిపడుతున్నారు. పోలీసులకు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ బాలికలపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌స్టా రీల్స్‌ మోజు… బండరాళ్ల మధ్య చిక్కుకుని నరకం చూసిన యువకుడు
తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలోని కొండా ప్రాంతాలలో ఓ ఘటన జరిగింది.. రీల్స్ వీడియోలు చేస్తూ వందల అడుగుల ఎత్తులో ఉన్న కొండరాళ్లపై విన్యాసాలు చేశాడు ఓ యువకుడు.. అయితే, వీడియోలు తీస్తూ ఒక్కసారిగా కొండపై భాగం నుంచి కింద పడిపోయి బండరాళ్ల మధ్య చిక్కుకున్నాడు.. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.. యువకుడిని కాపాడటానికి రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది.. అతికష్టం మీద కొండల మధ్య చిక్కుకున్న యువకుడిని కాపాడటానికి ప్రాణాలకి తెగించి విశ్వప్రయత్నాలు చేశారు రెస్క్యూ సిబ్బంది. యువకుడిను రెండు కర్రలకి బలంగా కట్టి కొండరాళ్ళపై నుంచి ఎంతో చాకచక్యంగా కాపాడారు.. అక్కడి నుంచి డోలి సహాయంతో కిందకి తీసుకొచ్చి ప్రభుత్వాస్పత్రికి తరలించారు రెస్క్యూ సిబ్బంది. కానీ, యువకుడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడం, మరోవైపు తల భాగంలో బలమైన గాయం కావడంతో యువకుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఇలా వీడియోల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. అయితే, ఈ ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

రూపాయి పెట్టి కొనుంటే ఇప్పుడు ఆ బ్యాంక్ మిమ్మల్ని కోటీశ్వరులను చేసేది
స్టాక్ మార్కెట్ అనేది అస్థిరమైన వ్యాపారం అని అందరికీ తెలుసు. దాంట్లో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరంగా భావిస్తారు. కానీ కొన్నిసార్లు అదే మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్టాక్ మార్కెట్లో అలాంటి చాలా షేర్లు ఉన్నాయి. అవి పెట్టుబడి దారుల అదృష్టాన్ని మారుస్తాయి. వారు నమ్మలేనంతగా రాబడిని ఇస్తుంది. మిమ్మల్ని నేల నుంచి అంతస్తుకు తరలిస్తాయి. అలాంటి షేర్ గురించి నేడు తెలుసుకుందాం. 1 నుంచి రూ.121కి ఎగబాకి ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన బ్యాంకింగ్ స్టాక్ ఒకటుంది. అదే సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్ (City Union Bank Stock) దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే వారికి బంపర్ రిటర్న్‌లను అందించడానికి తోడ్పడింది. సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్స్ కొంతకాలంగా క్షీణతను ఎదుర్కొంటూ ఉండవచ్చు, కానీ దీర్ఘకాలిక పెట్టుబడి పరంగా మల్టీబ్యాగర్ షేర్ అని నిరూపించబడింది. ఈ బ్యాంకింగ్ స్టాక్ పెట్టుబడిదారులకు రూ. 1 నుండి రూ. 121 వరకు ఉన్నప్పుడు 11,821 శాతం రాబడిని ఇచ్చింది. జనవరి 1, 1999న, సిటీ యూనియన్ బ్యాంక్ ఒక షేరు ధర కేవలం రూ.1.02. అప్పట్లో అందులో లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఇప్పుడు లక్షాధికారులుగా మారి ఉంటారు. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 205 కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.119.50.

టెక్నో పోవా 5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది.. 15 వేలకే 8GB RAM, 256GB వేరియంట్‌!
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘టెక్నో మొబైల్’ తన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు పోవా 5, పోవా 5 ప్రో 5జీ ధరలను అధికారికంగా వెల్లడించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు గత వారంలోనే లాంచ్ అయినా.. మంగళవారం కంపెనీ ధరలను ప్రకటించింది. Pova 5 ఫోన్ ప్రారంభ ధర రూ. 11,999 కాగా.. ప్రో ధర రూ. 14,999గా ఉంది. టెక్నో పోవా 5 ప్రో డిజైన్.. నథింగ్ ఫోన్ (2)తో సమానమైన ఫీచర్లతో వస్తుంది. పోవా 5, పోవా 5 ప్రో ధరలు, ఫీచర్లను ఓసారి చూద్దాం. టెక్నో పోవా 5 స్మార్ట్‌ఫోన్ 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో లాంచ్ అయింది. ఈ మోడల్ ధర రూ. 11,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ హరికేన్ బ్లూ, మెచా బ్లాక్, అంబర్ గోల్డ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మరోవైపు పోవా 5 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్‌లలో లాంచ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 14,999 కాగా.. 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ రూ. 15,999గా ఉంది. సిల్వర్ ఫాంటసీ, డార్క్ ఇల్యూజన్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. ఇక లాంచ్ ఆఫర్‌లో భాగంగా టెక్నో మొబైల్ సంస్థ మీకు రూ. 1,000 వరకు డిస్కౌంట్ అందించే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. అదనంగా 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. టెక్నో పోవా 5, టెక్నో పోవా 5 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండూ ఆగస్ట్ 22 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ లాంచ్ ఆఫర్‌లు పరిమిత రోజులు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

హీరో నుంచి చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ. 20తో 100 కిలోమీటర్ల ప్రయాణం!
ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీలలో ‘హీరో’ కూడా ఒకటి. హీరో కంపెనీ ఎప్పటికప్పుడు బడ్జెట్ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ ధరలో మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అదే హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్500 ఈఆర్ (Hero Electric NYX HS500 ER). ఈ స్కూటర్‌ ధర తక్కువగానే ఉండడం కాకుండా.. ఫీచర్లు కూడా అదిరిపోయాయి. అందుకే తక్కువ బడ్జెట్ ధరలో మంచి స్కూటర్ కొనాలనుకునేవారికి ఇది మంచి అప్షన్. హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్ 500 ఈఆర్ స్కూటర్ ధర రూ. 86,540గా ఉంది. ఇది ఎక్స్‌షోరూమ్ ధర. ఈ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. అయితే అధిక డిమాండ్ కారణంగా ప్రస్తుతం ఈ స్కూటర్ బుకింగ్స్ నిలిపివేశారు. త్వరలోనే ఓపెన్ అవనున్నాయని హీరో పేర్కొంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్లాక్, సిల్వర్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఎన్‌వైఎక్స్ హెచ్ఎస్ 500 ఈఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుంది. దీని మోటార్ పవర్ 1350 వాట్స్. ఇందులో క్రూయిజ్ కంట్రోల్ లేదు. డబుల్ బ్యాటరీ ఉన్న ఈ స్కూటర్ కెపాసిటీ 30 ఏహెచ్. ఒక్కసారి చార్జింగ్ పెడితే.. ఈ స్కూటర్ 138 కిలోమీటర్లు వెళ్తుందని కంపెనీ తెలిపింది. దీని టాప్ స్పీడ్ గంటకు 42 కిలోమీటర్లు.

పాక్ ప్రజలపై పెట్రో బాంబ్.. లీటరుకు రూ.15పెంపు..
పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ అక్కడి ప్రజల ఆశలు నిరాశ అయ్యాయి. ఇందుకు కారణం.. మంగళవారం పాకిస్థాన్‌లోని తాత్కాలిక ప్రభుత్వం పెట్రోలియం కొత్త ధరలను ప్రకటించనుంది. దీంతో బుధవారం అంటే ఆగస్టు 16వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.15 పెరగనుంది. కాగా డీజిల్ ధరలు లీటరుకు రూ.20 పెరగనున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో పెరిగిన ధరలు పెట్రోలియం ధరలను పెంచడం వెనుక వాదనలు వినిపిస్తున్నాయి. ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 5 డాలర్లు పెరిగి బ్యారెల్‌కు 91 డాలర్లకు చేరుకున్నాయి. అదే సమయంలో ముడి చమురుపై బ్యారెల్‌కు 2డాలర్ల చొప్పున ప్రత్యేక ప్రీమియం ఛార్జీ విధించబడుతుంది. గ్లోబల్ మార్కెట్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు బ్యారెల్‌కు 97 డాలర్ల నుంచి 102 డాలర్లకు 5 డాలర్లు పెరిగాయని చెబుతున్నారు. పాకిస్థాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 272.95 ఉండగా, డీజిల్ లీటరుకు రూ. 273.40 చొప్పున విక్రయిస్తున్నారు. 15 రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.19 పెంచారు. వాస్తవానికి రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురు సరఫరాను పాకిస్థాన్ నిలిపివేసింది. ముడి చమురును శుద్ధి చేస్తున్నప్పుడు దాని నుండి పెట్రోల్ కంటే ఎక్కువ ఫర్నేస్ ఆయిల్ (చమురు వ్యర్థాలు) బయటకు రావడమే దీనికి కారణం. రష్యా చమురు దిగుమతిని నిలిపివేయాలని పాకిస్తాన్ నిర్ణయించిన వెంటనే, ఇప్పుడు ధరలు పెరగబోతున్నాయన్న విషయం కలకలం రేపింది.

రజనీ ర్యాంపేజ్… 500 కోట్లు
సినిమాల పరిస్థితి ఒకప్పటిలా లేదు… అక్కడుంది సూపర్ స్టారా? మెగాస్టారా? అనేది చూడకుండా ఆడియన్స్.. కంటెంట్ ఉంటే చాలు, ఏ హీరో సినిమా పై అయినా కోట్ల వర్షం కురిపిస్తున్నారు. కంటెంట్ లేకపోతే రెండో రోజే థియేటర్ల నుంచి పంపిచేస్తున్నారు. ఇంతకుముందు రజనీ సినిమాలు ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ అది సూపర్ స్టార్ సినిమా అని హిట్ చేయలేదు. ఇప్పుడు మెగాస్టార్ ‘భోళా శంకర్’ సినిమా విషయంలోను అదే జరిగింది. నెగెటివ్ టాక్ వచ్చింది కాబట్టి భోళా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. జైలర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి.. బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తోంది. వరుస ఫ్లాపుల్లో ఉండడంతో రజనీకి కూడా జైలర్ పై నమ్మకం లేదు. కానీ సాలిడ్ కంటెంట్ పడితే.. మౌత్ టాక్‌తోనే సినిమాలు హిట్ అవుతాయని జైలర్ ప్రూవ్ చేసింది. ఫస్ట్ డేనే ఈ సినిమా వంద కోట్ల వరకు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండున్నర రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేసి.. మూడు రోజుల్లోనే 200 కోట్లకు పైగా రాబట్టింది. పోయిన గురువారం థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా.. మంగళ వారం వరకు మొత్తంగా ఆరు రోజుల్లో 400 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. దీంతో ఫాస్టెస్ట్ 400 కోట్ల క్లబ్‌లో చేరిన తమిళ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది జైలర్. రోబో 2.O, పొన్నియన్ సెల్వన్, కబాలి, విక్రమ్ సినిమా తర్వాత ఐదో చిత్రంగా జైలర్ నిలిచింది. అంతేకాదు.. ఈ వీకెండ్ వరకు 500 కోట్ల మార్క్‌ని టచ్ చేయడం గ్యారేంటీ అని లెక్కలు వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక తెలుగులో జైలర్ దెబ్బకు భోళా శంకర్ సినిమా మరింత వీక్ అయింది. కోట్ల షేర్ నుంచి లక్షల్లోకి పడిపోయినట్టుగా చెబుతున్నారు. కానీ జైలర్ మాత్రం కోట్లకు కోట్లు రాబడుతోంది. సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు డైరెక్టర్ నెల్సన్ ఇచ్చిన ఎలివేషన్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జైలన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాయని చెప్పొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • cricket
  • telangana
  • Tollywood
  • Top Headlines @ 9 AM on August 16th 2023

తాజావార్తలు

  • Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions