రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో రైతులకు మేలు జరగడం లేదు.. కనీసం ధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైన అసమర్థ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు.
రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు బీజేపీ పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు దశల వారీగా నిరసనలు ఉంటాయన్నారు.
బీఆర్కే భవన్ లో సీఈఓ వికాస్ రాజ్ తో బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు సోమభరత్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, పలువురు అడ్వకేట్స్ ఫిర్యాదు చేశారు.
మియాపూర్ కాల్పుల కేసును పోలీసులు చేధించారు. దేవేందర్ పై కాల్పులు జరిపి చంపేసిన రిత్విక్ అలియాస్ తిలక్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాలతోనే దేవేందర్ పై రిత్విక్ కాల్చి చంపినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
తెలంగాణాలో వరుస హత్యలు జరుగుతున్నాయి.. తాజాగా గవర్నమెంట్ టీచర్ హత్య సంచలనాలను క్రియేట్ చేస్తుంది.. పాఠశాలకు వెళుతుండగా ఉపాధ్యాయుడి బైక్ ను కారుతో ఢీకొట్టారు దుండగులు. కిందపడిపోయిన టీచర్ ను గొడ్డలితో నరికి అత్యంత కిరాతకంగా హతమార్చారు.. ఈ ఘటన తో జిల్లా ఉలిక్కి పడింది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూసుమండి మండలం నాయకన్ గూడెంకు చెందిన మారోజు వెంకటాచారిప్రభుత్వ ఉపాధ్యాయుడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం ప్రభుత్వ పాఠశాలలో ఇతడు పిఈటిగా పనిచేస్తున్నాడు..…
సీఎం కేసీఆర్ కేబినెట్ లోకి పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆయన రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు.