గద్వాల ఎమ్మెల్యేకు షాక్.. తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు
గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి డీకే అరుణను ఎమ్మెల్యేగా ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది. 2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని బండ కృష్ణ మోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టులో డీకే అరుణ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన తెలంగాణ ఉన్నత న్యాయస్థానం నేడు (గురువారం) కీలక తీర్పును ఇచ్చింది. అంతేకాదు, బండ కృష్ణమోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ. 3 లక్షల జరిమానా వేసింది. ఈ జరిమానాలో రూ. 50 వేలను డీకే అరుణకు ఇవ్వాలని హైకోర్టు తెలిపింది.
టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ.. వణుకు మొదలైంది..!
టక్కుటమార విద్యల్లో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. వైఎస్ జగన్ దీనికి పూర్తి విరుద్ధం అన్నారు. నిజాయితీగా రాజకీయం చేయటమే జగన్ కు వచ్చు.. 60 లక్షల ఓట్లు ఎవరివో తెలియని పరిస్థితి ఉంది.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్ళాలని మేం భావించాం.. ఈ విషయం జగన్ చెప్పిన వెంటనే చంద్రబాబులో వణుకు మొదలైందని విమర్శించారు. టీడీపీ మా సానుభూతి ఓటర్లను పెద్ద ఎత్తున తీయించిందని ఆరోపించిన ఆయన.. సున్నా డోర్ నెంబర్ తో అనేక ఓట్లు ఉన్నాయి.. ఓకే ఇంటి నెంబర్ పై 700 ఓట్లు ఉన్నాయి.. ఇవన్నీ మేం బయటకు తీస్తున్నాం.. ఉరవకొండలో ఓట్ల రద్దును ఎన్నికల సంఘం తప్పు పట్టలేదు.. రద్దు ప్రక్రియను తప్పు బట్టింది.. దీనికి ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? అని ప్రశ్నించారు. 2015, 2016, 2017 లో 50 లక్షలకు పైగా ఓట్లను తీయించాం.. సేవామిత్రా అనే యాప్ ద్వారా సేకరించిన సమాచారాన్ని బ్లూ ఫ్రాగ్ అనే ప్రైవేటు సంస్థకు టీడీపీ ప్రభుత్వం అప్పగించింది.. బ్లూ ఫ్రాగ్ కు, ఐటీ గ్రిడ్ కు మధ్య సంబంధం ఉంది అని ఆరోపించారు సజ్జల.. అక్కడి నుంచి ఓటర్‌ను గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టారన్న ఆయన.. ఎవరు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, ఏ టీవీ ఛానెల్ చూస్తారు వంటి మొత్తం సమాచారం సేకరించారిని విమర్శించారు. మా పార్టీ ఎంపీలు కూడా ఎన్నికల సంఘానికి వెళ్లి ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
నామినేట్ పోస్టుల ఎంపిక కసరత్తుకు బ్రేక్..? పాతవారే కొనసాగింపు..!
ఆంధ్రప్రదేశ్‌లో నామినేట్ పోస్టుల ఎంపిక కసరత్తుకు బ్రేక్ వేసింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలోని 130కి పైగా కార్పొరేషన్ల ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియపై స్పష్టతకు వచ్చింది వైసీపీ సర్కార్.. ఒకటీ రెండు చోట్ల మినహా.. దాదాపుగా అందరికీ కొనసాగింపు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.. అయితే, గత నెలలో పలు కార్పొరేషన్ పాలకమండళ్ల పదవీ కాలం ముగిసిపోయింది.. దీంతో.. అదే స్థానాల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లును కొనసాగించే అవకాశం ఉంది.. 56 బీసీ కార్పొరేషన్ల విషయంలోనూ ఇదే విధానాన్ని అనుసరించింది వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.
ఆరోగ్యశ్రీ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి.. సీఎం ఆదేశాలు
వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఆరోగ్య శ్రీ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించిన ఆయన.. విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధం కావాలన్నారు. సమగ్ర వివరాలతో బుక్‌లెట్ అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ రంగంలోని మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్వహణ అత్యంత సమర్థవంతంగా ఉండాలని స్పష్టం చేశారు. నిర్వహణకు నిధులు సమస్య రాకుండా ఒక విధానం తీసుకు రావాలన్నారు. ప్రభుత్వం విద్యా సంస్థలకు ఇచ్చే ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బుల్లో కూడా కొంత ఆయా సంస్థల నిర్వహణకు వినియోగించేలా ఒక విధానం తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు ఈ ఏడాది విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రి, ఏలూరు, నంద్యాలలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతాయని వెల్లడించారు.. ఇక, పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపూర్, మదనపల్లె మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు ప్రారంభం కానున్నట్టు పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో జరిగిన వైద్య ఆరోగ్య శాఖ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్ ఎంటి. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
దేవుడా మూడోసారి కూడా కేసీఆరే సీఎం కావాలి..
సిద్దిపేట జిల్లాలోని చేర్యాలలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ మూడో సారి సీఎం కావాలని కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ మధ్య నియోజకవర్గంలో ఉద్యమం, పోరాటాలు తెలియని కార్పోరేట్ శక్తులు అధికార, డబ్బు బలంతో నీచపు రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను ఉన్నప్పటికీ నా కుటుంబ సమస్యలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. నేను సీఎం కేసిఆర్ తోనే ఉంటా.. ప్రగతి భవన్లోనే ఉంటానని చెబుతూ నియోజకవర్గ కార్యకర్తలను మభ్య పెట్టే ప్రయత్నం పల్లా రాజేశ్వర్ రెడ్డి చేస్తున్నాడని ముత్తిరెడ్డి ఆరోపించాడు. తానే గొప్ప మేధావి, తన మేధస్సుతోనే వీఆర్ఏలకు విధులు, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసినరు అని చెప్పుకుని తిరిగే నీవ్వు ఉద్యమ సమయంలో ఎక్కడ ఉన్నావు అని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి ప్రశ్నించారు. పందికొక్కు మాదిరి దోచిన డబ్బుతో రాజకీయాలు చేయాలని చేస్తున్నావ్.. నువ్వు నడుపుతున్న కాలేజీ ఎవరిది, ఆడబిడ్డ పేరున ఉన్న కాలేజీని కబ్జా పెడితే.. నీ అక్క డిప్రెషన్ లోకి పోయింది నిజం కాదా అని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.
భారత్ జోడో యాత్ర-2 తేదీ ఖరారు.. గాంధీ పుట్టిన గడ్డ నుంచే..
మొదటి విడత భారత్ జోడో యాత్రకు విశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రెండో విడత యాత్రకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి నాడు రెండు విడత యాత్ర ప్రారంభం కానుంది. గుజరాత్‌లోని పోరుబందర్ నుంచి మేఘాలయా వరకు రెండో విడత భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. గాంధీ పుట్టిన గడ్డ నుంచే గాంధీ జయంతి రోజునే ఈ యాత్ర ప్రారంభం కానుండడం గమనార్హం. లడఖ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి దేశం మొత్తం యాత్ర చేయడానికి పూనుకున్నారు. కాంగ్రెస్‌ను ప్రజల వద్దకు తీసుకు వెళ్లి, ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి మరోసారి నడుం బిగించారు. 2024 జనవరిలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో విడత యాత్ర ముగియనుంది. అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం రాహుల్‌తో పాటు ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా విస్త్రత స్థాయిలో ప్రచారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రెండో విడతలో భారత్ జోడో యాత్రలో గుజరాత్ నుంచి మేఘాలయా వరకు పర్యటించనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిదశలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4వేల కిలోమీటర్లు రాహుుల్‌గాంధీ పాదయాత్రలో నడిచారు.
నిబంధనలు ఉల్లంఘించిన రిషి సునాక్.. పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఇదే
భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్.. బ్రిటన్ పార్లమెంట్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా తేలింది. సునాక్ భార్య అక్షత మూర్తికి పలు చైల్డ్ కేర్ కంపెనీలలో షేర్లు ఉన్నాయి. అయితే ఈ విషయాన్ని సునాక్ వెల్లడించలేదు. దీంతో తన భార్యకు ఉన్న షేర్ల విషయం చెప్పకుండా రిషి సునాక్ పార్లమెంటరీ నిబంధనలు ఉల్లంఘించారని విపక్షలు ఆరోపించాయి. ఈ చైల్డ్ కేర్ పథకాలతో అక్షత మూర్తి లబ్ధి పొందుతున్నారని కూడా ఆరోపణలు చేశారు. అయితే దీనిపై ఏప్రిల్‌లో పార్లమెంట్ కమీషనర్ ఫర్ స్టాండర్డ్స్ దర్యాప్తు ప్రారంభించింది. చట్టసభ సభ్యుల ప్రవర్తనా నియమావళిని పర్యవేక్షించే కమిషనర్ డేనియల్ గ్రీన్‌బర్గ్ ఆధ్వర్యంలో కమిటీ తాజాగా నివేదిక సమర్పించింది.
మేం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం.. చంద్రయాన్-3పై పాకిస్థాన్ యువకుడి ఫన్నీ కామెంట్
భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్‌ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు. కానీ పాకిస్తాన్ నుండి ప్రతిస్పందనలు భిన్నంగా ఉన్నాయి. చంద్రయాన్-3 సాఫీగా ల్యాండింగ్ అయిన కొన్ని గంటల తర్వాత, భారత్‌తో తరచూ విభేదిస్తున్న పొరుగున ఉన్న పాకిస్థాన్‌లోని వివిధ వ్యక్తులు భారతదేశ అంతరిక్ష విజయంపై స్పందించారు. చంద్రయాన్ -3 ల్యాండింగ్‌పై ఒక పాకిస్తానీ యువకుడు హాస్యాస్పదంగా కామెంట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ‘అరే.. వాళ్లు డబ్బులు పెట్టి మరీ చంద్రుడి మీదికి వెళ్లుతున్నారు. కానీ, మనం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం కదా’ అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆ వ్యక్తి తెలిపాడు. అదేంటి.. మనం చంద్రుడిపై ఎలా ఉన్నాం. భూమి పైనే ఉన్నాం కదా? అని జర్నలిస్టు అడగగా.. దీనికి సదరు యువకుడు చంద్రుడికి, పాకిస్తాన్‌కు మధ్య పోలికలను పేర్కొన్నాడు. చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయా? అని అడగ్గా లేవని జర్నలిస్టు సమాధానం ఇచ్చాడు. పాకిస్తాన్‌లోనూ నీళ్లు లేవని యువకుడు అన్నాడు. చంద్రుడి మీద గ్యాస్ ఉన్నదా? లేదని చెప్పగా అంతే! పాకిస్తాన్‌లో కూడా లేదని చెప్పాడు. చంద్రుడి మీద కరెంట్ ఉన్నదా? అని అడగ్గా యూట్యూబర్ లేదని జవాబిచ్చాడు. పాకిస్తాన్‌లో కూడా లేదు.. ఇప్పుడు కరెంట్ లేదు కదా..అని ఆ యువకుడు అన్నాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
పెరుగుతో ఇలా చేస్తే.. కొద్ది రోజుల్లోనే చుండ్రు, జుట్టు రాలే సమస్యలు దూరం..
వాతావరణ కాలుష్యాల వల్ల లేదా ఆహారపు అలవాట్లు మారడం వల్ల కానీ జుట్టు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.. ఆ సమస్యల నుంచి బయట పడటానికి కొందరు మార్కెట్ లో కనిపించిన అన్ని క్రీములను వాడేస్తారు.. అలా వాడటం వల్ల ఉన్న సమస్యలు పోవడం ఏమో గానీ కొత్త సమస్యలు వస్తాయి… అలాంటివారికి గుడ్ న్యూస్ ఇంటి చిట్కాలతో ఎలా తగ్గించుకోవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం.. దురద, చుండ్రు, జుట్టు రాలే సమస్య వంటి వాటిని తగ్గించుకోవటానికి ఖరీదైన నూనెలు,క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.. పెరుగుతో ఈ సమస్య నుంచి ఎలా బయటపడవచ్చునో ఇప్పుడు చూద్దాం.. ఒక బౌల్ లో రెండు స్పూన్ల పెరుగు, ఒక స్పూన్ శీకాయ పొడి, ఒక స్పూన్ ఆలోవెరా జెల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్లు,మాడు నుంచి కుదుళ్ల వరకు బాగా పట్టించాలి. అరగంట అయ్యాక రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.. పెరుగు తల మీద ఎటువంటి ఇన్ ఫెక్షన్ రాకుండా చేస్తుంది. శీకాయ జుట్టు రాలటం, చుండ్రు సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు మృదువుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.. పెరుగు పెట్టుకోవడం వల్ల పేలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే మీరు కూడా ట్రై చెయ్యండి..
మహేష్ బాబు రీల్ తల్లి రెండో పెళ్లి.. ?
సీనియర్ నటి సుకన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయుడు సినిమాలో.. పెద్ద కమల్ హాసన్ హత్య చేసి రావడమే భార్య బట్టలు సర్దేసి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఆ భార్య ఎవరు అనుకుంటున్నారు సుకన్యనే. ఈ సినిమా ఆమెకు ఎంత మంచి పేరును తీసుకొచ్చి పెట్టిందో అందరికి తెల్సిందే. ఈ సినిమానే కాదు.. పెద్దరికం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సుకన్య అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే శ్రీధరన్ అనే వ్యక్తిని పెళ్లాడిన ఆమె సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. ఇక వివాహ బంధంలో అడుగుపెట్టిన సుకన్య ఎక్కువ కాలం అందులో ఉండలేకపోయింది. భర్తతో విబేధాలు కారణంగా అతడి నుంచి విడిపోయి అమెరికాలో ఉంటున్న ఆమె ఇండియాకు వచ్చేసి ఒంటరిగా నివసిస్తోంది. ఇక ఇండియాకు వచ్చిన సుకన్య రీ ఎంట్రీ ఇచ్చి హీరోలకు తల్లిగా, అత్తగా మంచి మంచి సినిమాలు చేస్తూ బిజీగా మారింది. ముఖ్యంగా శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు కు తల్లిగా నటించి మంచి గుర్తింపును అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె గురించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. 50 ఏళ్ల వయస్సులో సుకన్య రెండో పెళ్లి అంటూ సోషల్ మీడియా లో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. ఇక ఈ పుకార్లపై ఆమె స్పందించింది. ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది. ” ఈ వయస్సులో నాకు రెండో పెళ్లా.. ? ఇప్పటివరకు నాకు ఆ ఆలోచన లేదన్నారు.
కరీనా కపూర్ వేసుకున్న ఈ డ్రెస్సు ధర ఎంతో తెలుసా?
బాలీవుడ్ క్విన్ కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాలతో పాటు ట్రెండ్ ను ఫాలో అవుతూ కుర్ర హీరోయిన్లకు పోటి ఇస్తుంది.. ఆకర్షణీయమైన రెడ్ కార్పెట్ ఈవెంట్ అయినా లేదా స్నేహితులు, కుటుంబ సభ్యులతో సన్నిహిత విందు అయినా కరీనా కపూర్ ఖాన్ తన ఫ్యాషన్ గేమ్‌లో ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండేలా ప్రయత్నం చేస్తుంది.. ఇటీవల జరిగిన హౌస్ పార్టీలో ఆమె మరోసారి తన ఫ్యాషన్ నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పుడు మేము ఆశ్చర్యపోలేదు. ఈ సమావేశానికి మలైకా అరోరా, కరణ్ జోహార్ మరియు అమృత అరోరాతో సహా పరిశ్రమ నుండి బెబో సన్నిహితులు హాజరయ్యారు. కఫ్తాన్‌లో అసమానమైన ఫ్యాషన్ ప్రకటన చేస్తూ, కరీనా రంగురంగుల డ్రెస్సును ధరించి కనిపించింది. ఒండే-ప్రింట్ సిల్క్-ట్విల్ కాఫ్తాన్ అని పిలువబడే ఎమిలియో పుక్సీ నుండి వచ్చిన కాఫ్తాన్, నలుపు, ఎరుపు, నారింజ మరియు నీలం రంగులలో స్పైరల్ ప్రింట్‌లను కలిగి ఉంది. ఫ్లోర్-లెంగ్త్ అవుట్‌ఫిట్‌లో పూర్తి-పొడవు స్లీవ్‌లు, పెరిగిన రంగు, నెక్‌లైన్‌పై కట్-అవుట్, భారీ సిల్హౌట్.. అసమాన హెమ్‌లైన్ ఉన్నాయి. ఆ రంగుల డ్రెస్సు ధర మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ డ్రెస్సు ధర దాదాపు రూ. 1, 44, 873 అవుతుంది. ఇంటిమేట్ పార్టీకి సౌకర్యవంతంగా ఉండేలా కరీనా ఆభరణాలతో లుక్‌ను యాక్సెసరైజ్ చేసింది. ఆమె తన రూపాన్ని స్టైల్ పెంచేందుకు స్టైలిష్ వాచ్ కూడా నల్లని చెప్పులను ఎంచుకుంది. గ్లామ్ విషయానికొస్తే, ఆమె ఎర్రబడిన బుగ్గలు, నగ్న పెదవి రంగు.. కనీస అలంకరణతో సహజంగా ఉంచింది. ఇకపోతే ఈ పార్టీకి OG ఫ్యాషన్ క్వీన్ మలైకా అరోరా కూడా హాజరయ్యారు. ఆమె ఆకుపచ్చ-రంగు నేల-పొడవు సమిష్టిలో ఖచ్చితంగా అద్భుతంగా కనిపించింది. కఫ్తాన్-శైలి దుస్తులలో నెక్‌లైన్, నడుముపై కీహోల్, తొడ-ఎత్తైన చీలిక మరియు భారీ సిల్హౌట్ ఉన్నాయి.. ఈ పార్టీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది..