బీఆర్కే భవన్ లో సీఈఓ వికాస్ రాజ్ తో బీఆర్ఎస్ నేతలు సమావేశం అయ్యారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ లీగల్ సెల్ నేతలు సోమభరత్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, పలువురు అడ్వకేట్స్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ సెల్, జనరల్ సెక్రటరీ సోమ భరత్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ నేతలు దొంగ దారులు వెతుక్కుంటున్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలో ఏ గుర్తుకి ఓటు వేసిన గెలిచేది నేను అని అరవింద్ వ్యాఖ్యలు చేశారు.. ఏ బటన్ నొక్కిన బీజేపీకే పడుతుందని మనసులో మాట బయటపెట్టారు అని ఆయన ఆరోపించారు.
Read Also: Chess World Cup 2023: ప్రపంచ చెస్ విజేత కార్ల్ సన్.. ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి
బీజేపీ అప్రజాస్వామీకంపై మాట్లాడితే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అని బీఆర్ఎస్ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ అన్నారు. ప్రజాస్వామ్య వాదులందర్నీ అనిచివేయాలని బీజేపీ వాళ్లు చూస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని సీఈవోను కోరాం.. ఎంపీ అరవింద్ పై చర్యలు తీసుకోవాలని కోరాం.. బీజేపీ నాయకులపై న్యాయబద్ధంగా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై తప్పుడు భావన ఉంటుంది అని ఆయన వెల్లడించారు. ఎంపీ కామెంట్స్ ను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ప్రధాన ఎన్నికల అధికారి హామీ ఇచ్చారు.
Read Also: Anand Mahindra: చంద్రయాన్ ప్రయోగంపై బీబీసీ విమర్శ.. ఘాటైన సమాధానం ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
ఇక, హఫీస్ లాయక్ ఖాన్, ప్రెసిడెంట్ జమియట్ ఉల్లమా ఈ హింద్ నిజామాబాద్ మాట్లాడుతూ.. ఏ గుర్తుకు ఓటు వేసిన అది బీజేపీకే పడుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసామన్నారు. ఎన్నికల్లో మేము ఏ గుర్తుకు ఓటు వేసిన అది పువ్వు గుర్తుకే పడుతుందని మేము భయపడుతున్నామని ఆయన అన్నారు. ఎన్నికల సంఘంపై మాకు నమ్మకం ఉంది.. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామని లాయక్ ఖాన్ అన్నారు.