రాజన్న సిరిసిల్ల జిల్లాలో నియోజకవర్గ స్థాయి విసృత సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కోడుకు కాకుంటే కేటీఆర్ ని ఎవరు దేకరు అని ఆయన అన్నారు. కేటీఆర్ భాష, అహంకారం చూసి వాళ్ళ పార్టీ వాళ్ళే సిగ్గుపడుతున్నారు..
తెలంగాణ కోసం అందరూ పోరాటం చేశారు అని ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే అన్నారు. సోనియాగాంధీ తెలంగాణకి స్వాతంత్రం ఇచ్చారు.. కేసీఆర్ పార్టీ బలం ఎంత అప్పుడు.. సోనియా వల్లనే తెలంగాణ వచ్చింది.. ఒక్క వ్యక్తి ఈ క్రెడిట్ అంతా నాదే అని చెప్పుకుంటున్నారు అని ఆయన అన్నారు.
ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. సమాచార పౌర సంబంధాల శాఖ, గనులు భూగర్భవనరుల శాఖను ఆయనకు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ (శనివారం) ఉత్తర్వులు జారీ చేశారు.
మహబూబాబాద్ లో బీజేపీ రాష్ట్ర ఎలక్షన్ కమిటీ ఛైర్మన్, హూజారాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పర్యటించారు. సెకండ్ ఎఎన్ఎంల దీక్ష 11 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపాడు.
కుషాయిగూడ పరిధిలో ఉన్న ఆపిల్ బిల్డింగ్ లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా న్యాయస్థానాల సముదాయ భవనాన్ని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే నేడు (శనివారం) ప్రారంభించారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, వివిధ అనుబంధ విభాగాలకు చెందిన నేతలు వ్యవసాయ క్షేత్రంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.
రేపు తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారు. రైతు ఘోష బీజేపీ భరోసా బహిరంగ సభలో షా పాల్గొంటారు.