హనుమకొండలోని వేద బంక్వెట్ హల్ లో బీజేపీ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో బీజేపీ రాజ్యసభ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 7న హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేసి నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. రేపు తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు బీజేపీ పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు దశల వారీగా నిరసనలు ఉంటాయన్నారు.
Read Also: Team India: టీమిండియా ఈ నియమాలు పాటించాలని BCCI ఆదేశం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని లక్ష్మణ్ పేర్కొన్నారు. దశల వారీగా ప్రభుత్వం ఒత్తిడి పెంచడానికే నిరసనలు చేస్తున్నాం.. డబ్బా ఇండ్లు వద్దు డబుల్ బెడ్రూం ఇండ్లు అన్నారు.. వడ్డీలకు సరిపోయే రుణమాఫీ ఇస్తున్నారు అని ఆయన ఆరోపించారు. బీసీలకు బిక్షం వేసినట్లు బీసీ బంధు పేరుతో లక్ష రూపాయలు ఇస్తామంటున్నారు.. రాష్ట్రంలో అరాచక పాలన, రాక్షస పాలన కనిపిస్తోంది.. బీజేపీ పోరాటాలకు కేసిఆర్ కు వణుకు పుడుతోంది.. ఇచ్చిన హామీలు అమలు చేయమంటే లాఠీలు ఝులిపిస్తారా అని లక్ష్మణ్ మండిపడ్డారు.
Read Also: RRR: జాతీయ అవార్డుల్లో సత్తా చాటి ఆర్ఆర్ఆర్.. ఏకంగా ఆరు విభాగాల్లో
ప్రశ్నిస్తే గొంతు నొక్కి, అక్రమ అరెస్టులు చేస్తున్నారు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. పోలీసులు అధికార పార్టీ నేతల కనుసన్నల్లో పనిచేస్తున్నారు.. గులాబీ గుండాలు పోగై రాళ్ల దాడికి పాల్పడ్డారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెప్పు కోసం పోలీసులు పనిచేస్తున్నారు.. దళితుడైన మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ను తీవ్రంగా దాడి చేశారు.. మేము కేంద్రంలో, 14 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాము.. మేము తలచుకుంటే కేసిఆర్ మహారాష్ట్రలో అడుగుపెట్టేవాడా అని ఆయన పేర్కొన్నారు.
Read Also: BRS: ఎన్నికల్లో గెలిచేందుకు వాళ్లు దొంగ దారులు వెతుక్కుంటున్నారు
రాజ్ మహల్ లా ప్రగతి భవన్ కట్టుకొని, పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వట్లేదు అని లక్ష్మణ్ పేర్కొన్నారు. 4 కోట్ల మంది పేదలకు బీజేపీ ఇండ్లు కట్టించింది.. లక్ష మందికి కూడా కేసిఆర్ డబుల్ బెడ్రూంలు ఇవ్వలేదు.. నిజాం నియంతలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.. అక్రమ అరెస్టులు, దాడులతో బీజేపీని ఆపలేరు.. ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తుందట.. ప్రగతి భవన్ వద్ద దీక్ష చేస్తే బీజేపీ మహిళా నేతలు కూడా పాల్గొంటారు కదా అని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసిఆర్ ఓటమికి దగ్గరయ్యాడు.. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. నిరాశ, నిస్పృహలతో కేసిఆర్.. పేదలకు సంక్షేమ పథకాలు దక్కే వరకు బీజేపీ పోరాడుతుంది అని ఆయన తెలిపారు. కేసిఆర్ నిజానికి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుంది అని ఆయన వ్యాఖ్యనించారు.