TS Govt: తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మరో ముందడుగు వేసింది. ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విభాగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతో వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం రూపొందించిన కమిటీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదిస్తూ జీఓ నెంబర్ 142 ను నేడు (గురువారం) విడుదల చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో మానవ వనరుల హేతుబద్ధీకరణ ప్రక్రియకు అనుమతించింది. పేషెంట్ లోడుకు అనుగుణంగా తగిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసుకునేలా మార్గదర్శకాలు రూపొందించారు.
Read Also: Encounters: బాలికలను రక్షించేందుకు ఎన్‌కౌంటర్లు అవసరం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
Also Read
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఒక్క డీఎంహెచ్ఓ మాత్రమే ఉండేవారు. పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా వైద్యారోగ్య అధికారుల పెంపును గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. ప్రస్తుత, భవిష్యత్ వైద్య అవసరాలు గుర్తించిన ప్రభుత్వం అదనంగా 5 డీఎంహెచ్ఓలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. చార్మినార్, ఎల్బీ నగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోన్ల వారీగా వీటి ఏర్పాటుకు అంగీకరించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 6 డీఎంహెచ్ఓలు ఉంటారు. కొత్త డీఎంహెచ్ఓలను కలుపుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 38 డీఎంహెచ్ఓలు ఉంటారు అని వైద్యారోగ్యశాఖ తెలిపింది.
Read Also: Allu Arjun: నేషనల్ అవార్డ్ ప్రకటన.. సుకుమార్ ను పట్టుకొని ఏడ్చేసిన అల్లు అర్జున్
రాష్ట్రంలో 636 పీహెచ్‌సిలు ఉండగా, ఇందులో సిబ్బంది ఏకరీతిగా లేదు అని వైద్యారోగ్య మంత్రి అన్నారు. వైద్యాధికారి, పర్యవేక్షక సిబ్బంది పోస్టులు ఏకరీతిగా పంపిణీ జరుగలేదు.. దీంతో పీహెచ్‌సిలను ఏకరీతి సిబ్బంది నమూనాను కలిగి ఉండేలా ప్రస్తుతం పునర్వ్యవస్థీకరించడం జరిగింది. కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో పీహెచ్‌సీలు లేవు.. వీటిలో 40 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది అని తెలిపారు. గతంలో 30 మండలాల్లో ఉన్న పీహెచ్‌సీలను ఆసుపత్రులుగా అప్‌గ్రేడ్ చేశారు.. ఈ ప్రదేశాలలో ఔట్‌రీచ్ కార్యకలాపాలు CHCలచే నిర్వహిస్తున్నారు. అయితే అన్ని సీహెచ్‌సీలను తెలంగాణ వైద్య విధాన పరిషత్‌కు బదిలీ చేయడం వల్ల, ఔట్‌రీచ్ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఈ ప్రదేశాలలో పీహెచ్‌సీల అవసరం ఏర్పడింది. ఈ 30 మండలాల్లో పీహెచ్‌సీలను మంజూరు చేసింది.
Read Also: Kushi : ఆ విషయంలో కంగారు పడుతున్న అభిమానులు..?
రాష్ట్రంలోని 235 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ బలోపేతం చేయడానికి, తగిన సిబ్బందిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ల సేవలు వినియోగించేందుకు వీలుగా.. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ లను TVVP ఆసుపత్రుల పరిధిలోకి తీసుకురావడం జరిగింది అని వైద్యారోగ్యశాఖ తెలిపింది. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఉన్న ప్రభుత్వ టీబీ ఆసుపత్రిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి తీసుకురావడం జరిగిందన్నారు. 1712 పోస్ట్‌లు సూపర్‌న్యూమరీ పోస్ట్‌లుగా మార్చబడ్డాయి.. మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) కేడర్ ఈ హేతుబద్ధీకరణలో కవర్ చేయలేదు.. కాబట్టి, PHCలు మరియు ఇతర సంస్థలలో మంజూరు చేయబడిన MPHA (F) పోస్టుల స్థానం మారదు అని పేర్కొంది. ఈ హేతుబద్ధీకరణ ప్రక్రియలో పేషెంట్ లోడ్ కు అనుగుణంగా, అవసరాల మేరకు సిబ్బందిని స్థానచలనం చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు విధించింది.
తాజావార్తలు
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
-
Vaishnav Tej: 100 కోట్ల హిట్టు కొట్టినా.. ‘ఉప్పెన’ హీరో ఏం చేస్తున్నాడు?.. ఇంత గ్యాప్ ఎందుకు?
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?