సీఎం కేసీఆర్ కేబినెట్ లోకి పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆయన రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు. 1994 నుంచి తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి మహేందర్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. 1994 నుంచి 2009 వరకు టీడీపీ క్యాండిడెట్ గా తాండూర్ నుంచి గెలిచిన ఆయన.. 2014 ఎన్నికల ముందు టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అయ్యాడు.
Read Also: Solar Energy: సోలార్ ఎనర్జీ ఉపయోగాలే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి మీకు తెలుసా?
అయితే, 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన పట్నం మహేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు దక్కింది. రవాణా శాఖ మంత్రి ఆయన పని చేశారు. 2018 ఎన్నికల్లో మరోసారి తాండూరు నుంచి పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా బరలోకి దిగిన పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్గికి బీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది. గత కొంతకాలంగా తాండూరు నియోజకవర్గంలో పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
Read Also: TS High Court: గద్వాల ఎమ్మెల్యేకు షాక్.. తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు
పైలెట్ రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి మధ్య బహిరంగంగానే పలుసార్లు తోపులాట, విమర్శలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక, బీఆర్ఎస్ పార్టీ ఇరువురి నేతల మధ్య రాజీకి ప్రయత్నించింది. కానీ, ఎవరూ కూడా బెట్టు వీడలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మరోసారి పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి వర్గంలోకి స్థానం కల్పిస్తామని చెప్పి.. రోహిత్ రెడ్డికి తాండూర్ ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇచ్చింది.