జాతీయ అవార్డుల్లో తెలుగు జెండా రెపరెపలాడింది
69 వ జాతీయ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. మునుపెన్నడు లేనివిధంగా ఈసారి తెలుగు జెండా రెపరెపలాడింది. తెలుగు ఖ్యాతిని పెంచిన సినిమాలకు అవార్డులు వరించాయి. ఇక దీంతో ఒక్కరిగా టాలీవుడ్ కాలర్ ను ఎగురవేసి.. తమ సత్తాను చూపించింది. అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు అవార్డులు వరించినవారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం.. విన్నర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు జెండా రెపరెపలాడింది అని ఆయన ప్రశంసించారు. ట్విట్టర్ ద్వారా అందరికి అభినందనలు తెలిపారు. “69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు జెండా రెపరెపలాడింది!వారికి నా శుభాకాంక్షలు మరియు అభినందనలు. అల్లుఅర్జున్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకోవడం.. దేవిశ్రీ ప్రసాద్ పుష్పకు ఉత్తమ సంగీతానికి జాతీయ అవార్డును గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఎస్ఎస్ రాజమౌళి గారు మరియు RRR యొక్క మొత్తం బృందం ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డు మరియు 5 ఇతర అవార్డులను గెలుచుకోవడం మరింత సంతోషాన్ని ఇస్తుంది. ఇక చంద్రబోస్ గారు కొండ పొలం చిత్రానికి గాను ఉత్తమ సాహిత్యానికి జాతీయ అవార్డును గెలుచుకున్నారు. మీరు మా అందరినీ చాలా గర్వించేలా చేసారు” అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ పేరుతో రూ.100 నాణెం.. విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్
టీడీపీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్మారకార్థం ఈ నెల 28వ తేదీన ప్రత్యేకంగా రూ.100 నాణేన్ని ఆవిష్కరించేందుకు సిద్ధం అయ్యారు.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ నాణేన్ని.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి.. అయితే, ఎన్టీఆర్ పేరుతో 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. ఈ కార్యక్రమ అతిథుల జాబితాలో ఎన్టీఆర్ భార్య అయిన తన పేరు కూడా చేర్చాలంటున్నారు నందమూరి లక్ష్మీపార్వతి.. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్‌తో తన వివాహం, ఎన్నికల్లో గెలుపు, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యుల కుట్రలు వంటి అంశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ప్రస్తావించిన లక్ష్మీపార్వతి.. ఆహ్వానితుల జాబితాలో తన పేరు చేర్చకుండా చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులను పిలవటంపై తన అసంతృప్తి వ్యక్తం చేశారు.. కాగా, ఎన్టీఆర్ చిత్రం ఉన్న వంద రూపాయల నాణెంను ఈ నెల 28న విడుదల చేయనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఎన్టీఆర్ చిత్రంతో 100 రూపాయలు నాణాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరిస్తారని రాష్ట్రపతి భవన్ పేర్కొనగా.. ఇప్పుడు లక్ష్మీ పార్వతితో లేఖతో కొత్త ట్విస్ట్ వచ్చి చేరినట్టు అయ్యింది.
రేపు విజయనగరం జిల్లాలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే..
రేపు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు సీఎం వైఎస్ జగన్.. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో కలిసి.. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి శంకుస్ధాపన చేయనున్నారు. ఇక, దీని కోసం రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లనున్నారు ముఖ్యమంత్రి.. విజయనగరం జిల్లాకు చేరుకోనున్న ఆయన.. మెంటాడ మండలం చినమేడపల్లిలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత దత్తిరాజేరు మండలంలోని మరడాం వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం జగన్.. అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.
జాతీయ సినిమా అవార్డులు.. అల్లు అర్జున్ సహా ఎవ్వరినీ వదలని పవన్..
69వ జాతీయ సినిమా అవార్డుల్లో టాలీవుడ్ సినిమాలు దుమ్మురేపాయి.. వివిధ విభాగాల్లో ఏకంగా 10 అవార్డులను సొతం చేసుకున్నాయి.. సింహ భాగం.. ఆరు అవార్డులను ఆర్ఆర్ఆర్ మూవీ కైవసం చేసుకుంటే.. ఆ తర్వాత పుష్ప సినిమా రెండు అవార్డులను, కొండపొలం, ఉప్పెన చేరో అవార్డును దక్కించుకున్నాయి.. ఇక, అవార్డులకు ఎంపికైన వారికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జాతీయ సినీ పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు.. 69వ జాతీయ సినీ పురస్కారాలలో తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విభాగాల్లో పురస్కారాలు దక్కడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్న ఆయన.. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తూ.. సినిమా రూపకల్పనలో నిమగ్నమయ్యే నటులు, రచయితలు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు పట్టం కట్టేలా జాతీయ పురస్కారాలు ఉంటున్నాయన్నారు. ఇక, పుష్ప చిత్రానికిగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపిక కావడం అందరూ ఆనందించదగ్గ విషయం అన్నారు పవన్ కల్యాణ్.. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి తొలిసారి ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికైన అర్జున్ కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బహుళ ప్రాచుర్య చిత్రంగా ‘ఆర్.ఆర్.ఆర్.’, ఈ సినిమాకుగాను విజేతలుగా నిలిచిన కీరవాణి, కాల భైరవ, శ్రీనివాస మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలోమన్, ఉత్తమ గీత రచయిత చంద్రబోస్ (కొండపొలం), ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్ పురుషోత్తమాచార్యులు.. ఇలా అందరికీ అభినందనలు తెలిపారు. మరోవైపు.. ‘ఉప్పెన’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవడం సంతోషకరం అన్నారు జనసేనాని.. ఈ చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకి, దర్శకుడు సానా బుచ్చిబాబుకీ అభినందనలు తెలిపారు.
ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ.. బీజేపీ మాస్టర్ ప్లాన్!
అక్టోబర్ రెండో వారంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి ముందు బీజేపీ రాజకీయ సమీకరణాలపై కసరత్తు ప్రారంభించింది. అసంతృప్తులను శాంతింపజేసేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు పార్టీ ప్రాంతీయ, కుల సమీకరణాలకు అనుగుణంగా మంత్రివర్గాన్ని విస్తరించబోతోంది. దీనికి సంబంధించి అధికార పార్టీలో మథనం సాగుతోంది. ఈ మేరకు బుధవారం రాత్రి కూడా సీఎం కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. 2020 మార్చిలో ప్రారంభమైన శివరాజ్ చౌహాన్ కేబినెట్‌లోకి ముగ్గురు నుంచి నలుగురు కొత్త సభ్యులు చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. నిజానికి, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సంబంధించి ఎంపీ కేబినెట్‌లో 35 మంది ఉండవచ్చు. ప్రస్తుతం కేబినెట్‌లో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ మినహా 30 మంది మంత్రులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నాలుగు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణకు ఇదే మొదటి కారణం కావచ్చు. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్ కేబినెట్ పెరుగుతుందనే చర్చ చాలా కాలంగా సాగుతోంది .2020లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం జ్యోతిరాదిత్య సింధియా మద్దతుతో ఏర్పాటైంది. సింధియాతో కలిసి పార్టీలోకి చేరిన వారికి న్యాయం చేసే క్రమంలో మంత్రివర్గంలో ప్రాంతీయ, కులాల సమతూకం చెడిపోయింది. ఫలితంగా అనేక ప్రాంతాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది. ఇదే సమయంలో పార్టీలో అసంతృప్తి పెరిగిపోయింది. ప్రస్తుతం పార్టీ అసంతృప్తిని నిర్వహించడంలో అధిష్ఠానం నిమగ్నమై ఉంది.
ఏం చేసినా ఈ 14 రోజుల్లోనే.. ఆ తర్వాత విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఏమవుతాయి?
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రపంచ వ్యాప్తమయింది. ఈ తరుణంలో ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా జాబిల్లిపై దాగి ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ జీవితకాలం కేవలం 14 రోజులే కావడం గమనార్హం. చంద్రుడిపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్, దాని నుంచి బయటకు వచ్చిన చంద్రునిపై సంచరిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్ ఏం చేసినా ఈ 14 రోజుల్లోనే పూర్తి చేయాలి. ఆ తర్వాత పనిచేయవా.. ఎందుకలా అనే ప్రశ్నలకు ఇస్రో సమాధానాలు ఇచ్చింది. చంద్రుడిపై దిగిన ల్యాండర్, దాని నుంచి వెలువడిన రోవర్ 14 రోజులపాటు నిర్విరామంగా పనిచేయనున్నాయి. ఈ మిషన్ లోని ల్యాండర్ గాని, రోవర్ గాని పనిచేయడానికి, అలాగే అవి సేకరించిన సమాచారాన్ని భూమికి పంపడానికి విద్యుత్ అవసరం. వాటికి కావాల్సిన విద్యుత్ సూర్యకాంతి ద్వారా వస్తుంది. అందుకే చంద్రునిపై సూర్యోదయం అయ్యే సమయానికి ల్యాండర్‌ను ఇస్రో విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఈ క్రమంలో ఈ మిషన్ లో ప్రధాన భాగాలైన లాండర్, రోవర్‌కు అమర్చిన సోలార్ ప్యానల్ సౌర శక్తిని స్వీకరించి విద్యుత్ శక్తిగా మార్చుకుంటాయి. ఆ శక్తి ద్వారా ల్యాండర్, రోవర్ పనిచేస్తాయి.
అక్కడ నాలుగు రోజులు అన్నీ బంద్..!
వచ్చే నెలలో ఢిల్లీ వేదికగా జీ-20 సదస్సు జరగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ప్రపంచంలోని ప్రముఖ నాయకులు ఢిల్లీలో సమావేశమవుతారు. ఈ సమయంలో అన్ని ప్రైవేట్ మరియు ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలు సెప్టెంబర్ 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు మూసివేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.. న్యూఢిల్లీలోని మార్కెట్లతో సహా బ్యాంకులు మరియు వాణిజ్య సంస్థలు కూడా మూసివేయబడతాయి. జీ20 సదస్సు దృష్ట్యా మూడు రోజుల ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించే ప్రతిపాదనకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం తెలిపారు. నగరంలోని అన్ని పాఠశాలలు మరియు కళాశాలలతో పాటు ఢిల్లీ ప్రభుత్వం మరియు MCD కార్యాలయాలు మూడు రోజుల పాటు మూసివేయబడతాయి. ఇక, తాజాగా, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలూ మూసివేస్తారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో శిఖరాగ్ర సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ సభ్యదేశాల రాష్ట్రపతి, ప్రధాని, విదేశాంగ మంత్రి, ఇతర విదేశీ అతిథుల రాక సెప్టెంబర్ 8 నుంచే ఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 8వ తేదీ నుండే సెలవు ప్రకటించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది.. మరోవైపు.. దానికి ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 7న జన్మాష్టమి నాడు సెలవు ఉంటుంది. అంటే సెప్టెంబర్ 7 నుండి 10 వరకు సెలవుదినం ఉంటుంది. దీంతో.. పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది సన్నాహాలు ప్రారంభించారు. ఢిల్లీ సర్కార్ నిర్ణయంతో ఢిల్లీలో నాలుగు రోజుల పాటు సెలవు ఉంటుంది.. ఈ సమయంలో ఏది మూసివేయబడుతుంది అనేది కూడా చాలా ముఖ్యం. ఏ మార్గం ప్రభావితం కావచ్చు మరియు ఏ మెట్రో స్టేషన్ మూసివేయబడుతుంది.
ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసేందుకు పాక్ కోర్టు పోలీసులకు అనుమతి
ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మే 9న జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేసేందుకు పాక్ కోర్టు పోలీసులకు అనుమతి మంజూరు చేసింది. ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని అటాక్ జిల్లా జైలులో ఉన్నారు. లాహోర్ పోలీసు ఇన్వెస్టిగేషన్ చీఫ్ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా.. మే 9న జరిగిన విధ్వంస ఘటనకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసి విచారించాలని లాహోర్ యాంటీ టెర్రరిజం కోర్టు ఆదేశించినట్లు పలు వార్త కథనాలు తెలుపుతున్నాయి. జిన్నా హౌస్ దహనం కేసులో మాజీ ప్రధాని ప్రమేయం ఉన్నందున ఆయనపై విచారణ జరిపి అరెస్టు చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ పై విచారణ జరిపేందుకు దర్యాప్తు బృందాన్ని అటాక్ జైలుకు పంపనున్నారు. ఈ బృందం తన నివేదికను కోర్టుకు సమర్పించనుందని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రకారం.. కాల్పుల కేసులో ఖాన్ అరెస్టును ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.
తక్కువ పెట్టుబడితో నెలకు రూ. లక్ష ఆదాయం..అదిరిపోయే బిజినెస్..
తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఉంటాయి. అలాంటి వారు తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో అనుబంధ వాహన వ్యాపారాల ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చు. ఈ వెంచర్ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు చక్కగా సరిపోతుంది. తక్కువ ఇనీషియల్ క్యాపిటల్‌తో స్టార్ట్ చేయవచ్చు… ఈరోజుల్లో కాలుష్యాల వల్లో లేక ఫ్యామిలీ కోసమో చాలా మంది కారును తీసుకోవాలని అనుకుంటారు.. కారు డీటైలింగ్ బిజినెస్‌ను స్టార్ట్ చేయడం మంచి ఆలోచన. కేవలం రూ.1 లక్ష పెట్టుబడితో వెంచర్ మొదలుపెట్టవచ్చు. ఈ బిజినెస్‌కు చాలా తక్కువ ఇన్వెంటరీ అవసరం అవుతుంది. దీంతో రీస్టాకింగ్ సమస్యలు ఉండవు. అంతేకాకుండా కార్ డీటైలింగ్ వర్క్‌షాప్‌లు, ఆటోమొబైల్ డీలర్‌షిప్‌లతో ఒప్పందాలు పొందవచ్చు. వీటితో స్థిరమైన ఆదాయం అందుతుంది. స్పెషలైజ్డ్ సర్వీసెస్ కోసం వర్క్‌షాప్‌కు తగిన సంఖ్యలో కార్లు వస్తే, కారు డిటైలింగ్ బిజినెస్‌లో లాభాలు నెలకు రెండు లక్షలకు పైగా ఉంటాయి.. అద్దె ఖర్చులు కూడా తీసేయ్యాలి.. జాక్‌లు, కార్ మౌంటింగ్‌లు, వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్, క్లాత్స్ డ్రైయర్, హెవీ-డ్యూటీ టూల్ సెట్, మినీ కంప్రెసర్ జెట్, 1 హార్స్‌పవర్ వాటర్ మోటార్ , అవసరమైన పైపింగ్ సెటప్ మొదట అవసరం అవుతాయి.. డ్రై క్లీనింగ్ సర్వీస్‌కి ఒక్కో కారుకు రూ.2,000 నుంచి రూ.4,000 మధ్య ఖర్చవుతాయి. ప్రతిరోజూ సగటున 3 నుంచి 4 కార్లు ఈ సర్వీసును పొందినా.. నెలకు సుమారుగా 120 కార్లు అవుతాయి. ఒక్కో కారుకు యావరేజ్‌గా రూ.3,000 ఛార్జ్ చేస్తే.. సంపాదన నెలకు దాదాపు రూ.3.20 లక్షలు అవుతుంది.. ఎటు లేదనుకున్నా 2 లక్షలను నెలకు తీయ్యొచ్చు.. నష్టం లేదు కాబట్టి ఈ బిజినెస్ ను ఎవరైనా మొదలు పెట్టొచ్చు..
జాతీయ అవార్డుల్లో సత్తా చాటి ఆర్ఆర్ఆర్.. ఏకంగా ఆరు విభాగాల్లో
ఆర్ఆర్ఆర్.. ఆర్ఆర్ఆర్.. మరోసారి ఆర్ఆర్ఆర్ మోత మోగించేసింది. సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అరుదైన అవార్డులను అందుకున్న ఆర్ఆర్ఆర్.. ఈ ఏడాది జాతీయ అవార్డుల్లో కూడా తన సత్తా చాటింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6 విభాగాల్లో నిలిచి మరోసారి తెలుగోడి సత్తాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. బెస్ట్ కొరియోగ్రాఫర్ గా ప్రేమ్ రక్షిత్ ఎన్నికవ్వగా.. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా కాల భైరవ నిలిచాడు. ఇక బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా కీరవాణి ఎన్నికవ్వగా.. బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో స్టంట్ కొరియోగ్రఫీ గా కింగ్ సోలోమన్ ఎంపిక అయ్యాడు. ఇక బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రోవైడింగ్ హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ కేటగిరిలో ఆర్ఆర్ఆర్ నిలిచింది. అంతేకాకుండా బెస్ట్ స్పెషల్ ఎఫక్ట్ విభాగంలో శ్రీనివాస్ మోహన్ ను జాతీయ అవార్డు వరించింది. ఇక ఇదే సినిమాలో సీతగా నటించిన అలియా భట్ కు కూడా అవార్డు వరించింది. ఆమె బాలీవుడ్ లో నటించిన గంగూభాయ్ కతీయావాడి సినిమాకు గాను ఉత్తమ నటి అవార్డును అందుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ .. 2021 మార్చి 25 న రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది.
ఇంద్రజ కూతురును చూశారా.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ కానీ… ?
నీ జీను ప్యాంట్ చూసి బుల్లేమో అంటూ కుర్రకారును తన అందాలతో మత్తెక్కించిన నటి ఇంద్రజ. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె.. పెళ్లి తరువాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయింది. ఇక ఈ మధ్యనే ఆమె మళ్లీ సినిమాలతో బిజీగా మారింది. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తుంది. ఇంకోపక్క బుల్లితెరపై కూడా ఇంద్రజ తన సత్తా చాటుతుంది. మినిస్టర్ పదవి వచ్చాక రోజా జబర్దస్త్ కు దూరమైన విషయం తెల్సిందే. ఇక రోజా ప్లేస్ ను ఇంద్రజ భర్తీ చేస్తోంది. జడ్జిగా పలు షోస్ లో మెరుస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఇంద్రజ.. ఒక డ్యాన్సర్. శాస్త్రీయ నాట్యములో ఇంద్రజ చిన్నప్పుడే శిక్షణ తీసుకుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదర్శనలు కూడా ఇచ్చింది. మొదటి నుంచి తనకు సంగీతం అన్నా, డ్యాన్స్ అన్నా కూడా ప్రాణమని ఆమె చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఆమె వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందా.. ? అంటే నిజమే అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇంద్రజ కూతురు పేరు సారా. ఆమె ప్రస్తుతం మ్యూజిక్ నేర్చుకుంటుంది అంట.. ఈ మధ్యనే ఇంద్రజ తన కూతురు ఏమవుతుందో చెప్పుకొచ్చింది. ” నా కూతురిలో నటి కన్నా.. మ్యూజిక్ లవర్ కనిపిస్తుంది. భవిష్యత్ లో ఆమె మ్యూజిక్ డైరెక్టర్ అవుతుందని నాకు అనిపిస్తుంది” అని చెప్పుకొచ్చింది. దీంతో అభిమానులు.. మీలానే మీ కూతురు కూడా చాలా అందంగా ఉంది.. హీరోయిన్ గా ట్రై చేసినా ఛాన్సులు వస్తాయని.. కానీ , ఆమెకు నచ్చిన రంగంలో కొనసాగితే అది ఆమె కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి సారా.. ఏమవుతుందో చూడాలి.
పుష్పను వదిలేసి మహేష్ తప్పు చేశాడా.. ?
పుష్ప.. అల్లు అర్జున్.. సుకుమార్.. నేషనల్ అవార్డ్స్.. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. 69 వ నేషనల్ అవార్డ్స్ లిస్ట్ ను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇక అందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డును కైవసం చేసుకున్నాడు. ఇక దీంతో అభిమానులు బన్నీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక మరికొందరు ఈ సినిమా ను వదిలేసుకున్న హీరో గురించి మాట్లాడుతున్నారు. అవును .. పుష్ప కథను .. సుకుమార్ ముందుగా మహేష్ బాబుకు చెప్పాడు. మహేష్ ఈ కథను వద్దని చెప్పడంతో.. పుష్ప.. అల్లు అర్జున్ వద్దకు వెళ్ళింది. ఈ విషయాన్నీ మహేష్ ట్విట్టర్ వేదికగా అప్పుడే అభిమానులకు తెలిపాడు. కొన్ని కారణాల వలన సుకుమార్ తో తన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని, మంచి కథ దొరికితే తామిద్దరం చేయడానికి రెడీ గా ఉన్నామని చెప్పుకొచ్చాడు. వీరిద్దరి కాంబో లో వన్ నేనొక్కడినే సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఇకపోతే మహేష్.. ఈ కథను వద్దనడానికి కూడా రీజన్ ఉంది. మొదటి నుంచి కూడా మహేష్ తన బాడీ లాంగ్వేజ్ కు సూటయ్యే సినిమాలనే ఎంచుకుంటాడు. పుష్పలో ఉన్న డెప్త్ ను తాను క్యారీ చేయలేనని.. అందుకే ఆ సినిమా చేయలేనని సుకుమార్ తో చెప్పాడట. నిజం చెప్పాలంటే.. అల్లు అర్జున్ పుష్ప చూశాక .. ఆ పాత్రలో అతను తప్ప మరొక హీరోను ఉహించుకోలేం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు నేషనల్ అవార్డు వరించింది కాబట్టి పుష్పను వదిలేసి మహేష్ తప్పు చేశాడా.. ? అంటున్నారు. కానీ, మహేష్ అలాంటి పాత్రలకు సెట్ అవ్వడని ఆయనకే తెలుసు కాబట్టి.. ఆ నిర్ణయం తీసుకున్నాడని బన్నీ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇవన్నీ పక్కనపెడితే.. ఎవరికి రాసి పెట్టి ఉన్న సినిమా వారికే చెందుతుంది. ఇక పుష్ప అంటే బన్నీనే.. ఇక డిస్కషన్స్ అవసరమే లేదు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.