సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా సచివాలయంలో రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోకి అడుగుపెట్టగానే ఆయనకు పోలీసులు గౌరవ వందనం…
'తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు.. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు'' అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ మీటింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. సీఎం హోదాలో రేవంత్ తొలిసారి సచివాలయానికి వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు కూడా సచివాలయానికి వచ్చారు. ఇదిలా ఉంటే.. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. అదే విధంగా.. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్గా బి.శివధర్రెడ్డి నియమిస్తూ.. సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
త ప్రభుత్వం ప్రగతి భవన్ చుట్టు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించాను అంటూ తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారు.. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాం.. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చు.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ప్రగతి భవన్ ముందున్న బ్యారికేడ్స్ లోపలి నుంచి ట్రాఫిక్ కు పోలీసులు అనుమతి ఇచ్చారు. బ్యారికేడ్స్ తొలగింపుతో ట్రాఫిక్ కు పర్మిషన్ ఇచ్చారు. ట్రాఫిక్ పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఈ చర్య కొనసాగుతుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తొలి కాంగ్రెస్ సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.