తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కీమ్ 'మహాలక్ష్మి' ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ముందు మహిళా మంత్రులు కొండా సురేఖా, సీతక్క, సీఎస్ శాంతికుమారి, తెలంగాణ మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పలువురు ఎమ్మెల్యేలు, , రవాణా శాఖ సెక్రటరీ వాణిప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మహిళా మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు, మహిళా…
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వేళ.. ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చును 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేసీఆర్ కు నాలుగు గంటలకు పైగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు.. మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరం అవుతుంది అని డాక్టర్లు తెలిపారు.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారు.. తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో.. మనం చూడలేదు.. కానీ, తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని ఆ తల్లి మనకు భరోసా ఇచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
ఫైనల్గా కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్రెడ్డి.. నిన్న ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సమావేశమైన రేవంత్రెడ్డి.. ఎవరికి ? ఏ శాఖ కేటాయించాలి అనే దానిపై చర్చించి వచ్చారు.. అయితే, మంత్రులకు శాఖలు ఈ శాఖలు కేటాయించారు
ఇవాళ తెలంగాణ రాష్ట్ర కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.