తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. తొలి కాంగ్రెస్ సీఎంగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04కి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అయితే, ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లతో పాటు, ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరకాబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం స్టాలిన్‌తో పాటూ.. వివిధ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానం పంపించారు. ఎల్బీ స్టేడియం దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తుతో పాటూ.. ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేస్తున్నారు.
Read Also: Off The Record: ఆరు ఎమ్మెల్సీ సీట్లకు ఎంతమంది పోటీ..? కాంగ్రెస్‌కు దక్కేవి ఎన్ని? డిమాండ్ ఎంత?
అయితే, రేవంత్ రెడ్డితో పాటు మరికొద్ది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీగా ఇచ్చిన ‘ఆరు గ్యారంటీల’ పథకాలకు సంబంధించిన తొలి ఫైల్‌పై సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేయబోతున్నారు. అలాగే రజని అనే దివ్యాంగురాలికి తొలి ఉద్యోగాన్ని ఇస్తూ ఫైలుపై ఆయన సంతకం చేయనున్నారు. ఇక, రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులుగా ఎంత మంది ప్రమాణ స్వీకారం చేస్తారన్నది ప్రస్తుతం చర్చనీయాంమైంది.