Wife Kills Husband: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో అసలు నిజాలు బయటకు వచ్చాయి. భార్య మాధురి వ్యవహారంపై అనుమానంతో ఇంటి దగ్గర ఉన్న సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు భర్త శివ నాగరాజు ప్రయత్నం చేశాడు. సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తే తన వ్యవహారం బయటపడుతుందని ఆమె ఒప్పుకోలేదు.. దీంతో భర్తను అడ్డు తొలిగించుకోవడానికి ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది.
Read Also: Deputy CM Pawan: నేడు నాందేడ్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
ఇక, ప్రియుడు గోపి తన స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టరుతో కలిసి హత్యకు ప్లాన్ చేశాడు. సదరు ఆర్ఎంపీ డాక్టర్ తెచ్చిన నిద్రమాత్రలను భార్య మాధురి బిర్యానీలో కలిపి భర్త శివ నాగరాజుకు ఇచ్చింది. అనంతరం అతడ్ని ప్రియుడి సాయంతో హత్య చేసేసింది. ఇక, ప్రియుడు గోపితో పాటు అతడి స్నేహితుడు ఆర్ఎంపీ డాక్టర్ ను కూడా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. శివ నాగరాజు హత్యపై మాధురి, గోపి, ఆర్ఎంపీలను విచారణ చేస్తున్నారు.