* నేడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. మ. 1. 04 గంటలకు ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణం.. రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల ప్రమాణస్వీకారం..
* నేడు రేవంత్ ప్రమాణ స్వీకారంకి హాజరుకానున్న సోనియా గాంధీ , ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఒకే ఫ్లైట్ లో ఉదయం 9:30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకోనున్న నేతలు..
* నేడు రేవంత్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు అవుతున్న కర్ణాటక సీఎం సిద్ధి రామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి కర్ణాటక సీఎం..
* నేడు ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయనున్న సీఎం జగన్.. సీఎంతో పాటు దుర్గగుడి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, తానేటి వనిత..
* నేడు విశాఖపట్నంలోని ఎస్.రాజా గ్రౌండ్స్ లో జనసేన బహిరంగ సభ.. పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్న పలువురు వ్యాపార ప్రముఖులు, రాజకీయ నాయకులు.. మధ్యాహ్నం నగరానికి చేరుకోనున్న జనసేన చీఫ్..
* నేడు విజయవాడలో వికిసిత్ సంకల్ప యాత్రలో పాల్గొననున్న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
* నేడు అనంతపురంలోని మడకశిరలో జరిగే సామాజిక సాధికార బస్సుయాత్రలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* నేడు పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటన.. తణుకులో ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి..
* నేడు నుంచి గన్నవరం విమానాశ్రయంలో విమాన సర్వీసులు పునరుద్ధరణ.. మీచౌంగ్ తుఫాన్ దాటికి గత 3 రోజులుగా విమాన సర్వీసులు రద్దు.. నేటి నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్న అన్ని విమాన సర్వీసులు
* నేడు తిరుపతిలో పెద్దిరెడ్డి పర్యటన.. పుత్తూరులో డీప్యూటీ సీఎం నారాయణ స్వామి పర్యటన
* నేడు బాపట్లలోని చెరుకుపల్లి మండలంలో పంట నష్టం వివరాలను పరిశీలించనున్న బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా నేతలు..