ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తానే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేఏ పాల్ శుభాకాంక్షలు తెలిపారు. తాను చెప్పినట్టే కాంగ్రెస్ గెలిచిందని.. 65 సీట్లు వస్తాయని చెప్పానని, అలానే వచ్చాయన్నారు కేఏ పాల్.
Harish Rao: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రికి రావద్దని మాజీ మంత్రి హరీశ్‌రావు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఇవాళ ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నానని ప్రలందరూ ఆహ్వానితులే అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. కాగా.. ప్రగతి భవన్.. జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజాభవన్‌గా మారిన విషయం తెలిసిందే.
CM Revanth Reddy: ప్రగతి భవన్.. జ్యోతిరావు పూలే భవన్ లో ప్రజాభవన్‌గా మారింది. ప్రజా భవన్ గేట్లు తెరిచి ఉన్నాయి. దశాబ్దం తర్వాత సామాన్యుడి అడుగులు పడిపోయాయి.
కేబినెట్ మీటింగ్ కు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు వివరాలను వెల్లడించారు. 6 గ్యారంటీలపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించామని తెలిపారు. వాటి అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలపై చర్చించామని చెప్పారు. రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చిస్తారని.. ముందుగా సోనియా గాంధీ పుట్టినరోజైన ఎల్లుండి 2 గ్యారంటీల అమలు ప్రారంభిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు రవాణా సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వరకు…