పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రేవంత్రెడ్డి, సీతక్క ఫొటోలతో ఓ భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.. జువ్వలపాలెం రోడ్ లో రేవంత్ రెడ్డి, సీతక్క ఫ్లెక్సీలను పివిటి బ్రదర్స్ పేరుతో ఏర్పాటు చేశారు..
తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల పండగ మొదలవనుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో.. ఇప్పుడు గ్రామ పంచాయతీల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. అందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. కాగా.. సర్పంచుల పదవీ కాలం 2024 జనవరి 31వ తేదోతో ముగియనుంది. ఈ క్రమంలో సర్పంచులు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లపై వివరాల కోసం జిల్లాల వారీగా నివేదిక కోసం ఎలక్షన్…
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు రేవంత్రెడ్డి.. ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికారు.. తెలంగాణ ప్రజలకు అభినందనలు.. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది అన్నారు
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. సెక్రటేరియట్ వద్ద తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగులు విజయోత్సవాల్లో పాల్గొన్నారు. సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని తెలిపారు.
Telangana Women’s Free Bus Travel Scheme: ‘ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం’.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో ఇది ఒకటి. తాము అధికారంలోకి వస్తే.. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. చెప్పిన విధంగానే మహిళల ఉచిత ప్రయాణంకు ఏర్పాట్లు చేస్తోంది. ఏయే కేటగిరీ బస్సుల్లో అమలు చేస్తే.. ప్రభుత్వానికి ఎంత భారం పడనుందనే విషయంలో ఆర్టీసీ అధికారులు ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు. కర్ణాటక…
తెలంగాణ రాజ్ భవన్ కు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవితో పాటు ఇతర సీనియర్ నేతలు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టు సంతకాలతో కూడిన లేఖను గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కు కాంగ్రెస్ బృందం అందజేసింది.