ఏపీలోని తుపాను ప్రభావిత పరిస్థితులపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఖమ్మం జిల్లా ఏ మాటకు ఆమాట కాంగ్రెస్ జిల్లా అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. పోయినసారి ఇదే ఫలితం వచ్చింది... మేము ఇతర పార్టీల్లో గెలిచాం.. పువ్వాడ అజయ్ మాత్రమే పార్టీలో గెలిచారు.. జిల్లాలో కాంగ్రెస్ గాలి మనకు ఉరితాళ్ళు అయినవి.. తమ్మినేని వీరభద్రంకు కూడా ఓట్లు పడలేదు అని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డా. బీఆర్. అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్. బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
Revanth Reddy Swearing Ceremony Time Changed: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకార సమయంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. గురువారం (డిసెంబర్ 7) మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం 10.28 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా నిర్ణయించగా.. తాజాగా ఆ సమయంలో స్వల్ప మార్పు జరిగింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.…
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా ఇల్లందు సింగరేణి ఏరియాల్లో ఎడ తెరిపిలేని వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గనిలో 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు నిలిచిపోయింది.
రెండో రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు. నిన్న (మంగళవారం) రాత్రి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఎంపీ మాణిక్కం ఠాగూర్ తో ఆయన సమావేశం అయ్యారు.
హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన కొత్త ఎమ్మెల్యేలకు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ
బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్ వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా భారీగానే పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.