CM YS Jagan: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది.. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభమైన వెంటనే రేవంత్ రెడ్డిచేత గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత మంత్రులుగా మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావుతో వరుసగా ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్.. అయితే, తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..
Read Also: Maharashtra: తనను ఆటపట్టిస్తుందని 8 ఏళ్ల బాలికను చంపేసిన బాలుడు..
‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు.. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు” అంటూ ట్వీట్ చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, ‘రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’ అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు సీఎం జగన్.. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య.. జల వివాదాలతో పాటు.. మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశాలు పెండింగ్‌లో ఉన్న విషయం విదితమే. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పేర్కొనడం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 7, 2023