తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి హోదాలో తొలి ప్రసంగం చేశారు. ఎన్నో త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందిన్నారు. ఈ ప్రభుత్వ ఏర్పాటుతో తెలంగాణ మొత్తం అభివృద్ది చెందుతుంది.. గత ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకోలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సమిధిగా మారి తెలంగాణ ఇచ్చింది.. అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇక, గత ప్రభుత్వం ప్రగతి భవన్ చుట్టు ఏర్పాటు చేసిన ఇనుప కంచెలను బద్దలు కొట్టించాను అంటూ తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారు.. ప్రజాభవన్ లో ప్రజా పరిపాలన అందిస్తాం.. ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చు.. తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.