రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులు విడుదల చేసింది కేంద్ర ఆర్థిక శాఖ.. అదనపు వాయిదా కింద మొత్తం 72,961.21 కోట్ల రూపాయలు విడుదల రిలీజ్ చేసింది.. నూతన సంవత్సరం, పండుగల నేపథ్యంలో సంక్షేమ, మౌలిక వసతుల కోసం నిధుల ముందుగానే విడుదల చేస్తున్నట్టు పేర్కొంది.
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై వాహనదారులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.. పేరుకుపోయిన చలాన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.. ఈ నెల 26వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకు చలాన్లపై ఈ డిస్కౌంట్ కొనసాగనుంది.. సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై తగ్గింపును గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.. ఈ చలాన్ ట్రాఫిక్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన చెప్పారు. దేశంలో ప్రజా స్వామ్యం ఉందా.. నియంతృత్వ పోకడతో పాలన నడుస్తుంది.. దేశాన్ని రక్షించాలి అని ఆలోచన బీజేపీకి లేదు.. 146 మంది సభ్యులను సస్పెండ్ చేయడం ఏంటి? అని భట్టి విక్రమార్క అన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరిగినా వైద్యులు సిద్ధంగా ఉన్నారు.. ఇప్పటికే అక్కడక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.. అప్రమత్తంగా ఉండాలని అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి కరోనా సన్నద్ధతపై వివరించాం.. అన్ని హస్పటల్స్ లో కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ఏడాది 63శాతం నేరస్తులకు శిక్షలు పడ్డాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 13 కేసులో 13 మందికి జీవిత ఖైదీ శిక్షలు.. గత ఏడాదితో పోల్చితే 2 శాతం క్రైమ్ కేసులు పెరిగినట్లు చెప్పారు.
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సింగరేణి లో గుర్తింపు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికల్లో పాగా వేయటానికి అటు ఏఐటీయూసీ ఇటు ఐఎన్టీయూసీ పావులు కదుపుతున్నాయి.
వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అదిరిపోయే శుభవార్త చెప్పారు. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ రెడీ అవుతుంది.