Ind vs NZ 3rd T20I: గౌహతి వేదికగా జరిగిన భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లకు భారత బౌలర్లు గట్టి అడ్డుకట్ట వేశారు. టాస్ గెలిచిన భారత్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా, నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లను కోల్పోయింది. డెవన్ కాన్వే (1) హర్షిత్ రాణా బౌలింగ్‌లో ఔట్ కాగా, రచిన్ రవీంద్ర (4) కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో కివీస్ స్కోరు 13 పరుగులకే 2 వికెట్లు పడిపోయింది. ఆపై టిమ్ సైఫర్ట్ (12)ను జస్ప్రీత్ బుమ్రా వెనక్కి పంపాడు.
Chiranjeevi Gifts Range Rover: హిట్ మిషన్ కు మెగా గిఫ్ట్..!
ఈ పరిస్థితుల్లో గ్లెన్ ఫిలిప్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. 40 బంతుల్లో 48 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనికి తోడుగా మార్క్ చాప్మన్ (32)తో కలిసి మధ్య ఓవర్లలో కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే రవి బిష్ణోయ్ వీరిద్దరినీ పెవిలియన్‌కు పంపడంతో మ్యాచ్ మళ్లీ భారత్ వైపుకు తిరిగింది. చివర్లో కెప్టెన్ మిచెల్ సాంట్నర్ 17 బంతుల్లో 27 పరుగులు చేసి వేగంగా స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. డారిల్ మిచెల్ (14) కూడా అతడికి సహకరించదు. అయినప్పటికీ భారత బౌలర్లు చివరి ఓవర్లలో వికెట్లు తీస్తూ కట్టడి చేశారు.
Padma Awards 2026: రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన గౌరవం.. హిట్ మ్యాన్‌ను వరించిన పద్మశ్రీ!
భారత బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసాడు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా 2 , హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు.
Innings Break!
Terrific bowling effort by #TeamIndia in Guwahati 👏
Chase coming up shortly⌛
Scorecard ▶️ https://t.co/YzRfqi0li2#INDvNZ | @IDFCFIRSTBank ️ pic.twitter.com/iBxD7a7W0D
— BCCI (@BCCI) January 25, 2026