సైబరాబాద్ పరిధిలో గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య పెరిగిందని కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి తెలిపారు. గతేడాది 27, 322 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 29, 156 కేసులు రిజిస్ట్రల్ అయ్యాయి.. మహిళలపై నేరాలు తగ్గాయి.. ఈ ఏడాది 105 హత్య కేసులు నమోదు కాగా, సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి..
ఇవాళ సాయంత్రం 4 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో సిఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. ఆటో, ఊబర్ వాహానాల డ్రైవర్లతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఘన నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశ ప్రధానిగా, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు అని చెప్పుకొచ్చారు.
మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు వర్దంతి సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్ఞానభూమి వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులు ఘటించారు.
మహాలక్ష్మీ పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) కీలక సూచన చేసింది. తక్కువ దూరం వెళ్లాల్సిన మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన అభివృద్ధి, సృష్టించిన సంపదను తెలిపేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్ వేదికగా ఇవాళ ఉదయం 11 గంటలకు ‘స్వేద పత్రం’ రిలీజ్ చేయనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ మృత్యువు గంట మొగిస్తుంది.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఒమెక్రాన్ కొత్త వేరియంట్ జెఎస్.1 కలకలం రేపుతోంది. చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది.. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 29 ఉండగా ఈరోజు మళ్లీ పెరిగింది.. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 30 కి పైగా చేరింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో దాదాపు 10…
మరోసారి కరోనా అలజడి మళ్లీ మొదలైంది. కొవిడ్ కొత్త వెరియంట్ జేఎన్-1 కారణంగా క్రమంలో దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో సైతం కరోనా విజృంభిస్తోంది. కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ కొత్త కేసులతో కలిసి రాష్ట్రంలో 27 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్లో వెల్లడించారు. అలాగే ఒకరు రికవరీ అయ్యారు. కాగా ఈ రోజు తెలంగాణలో…