Night temperatures Falling Down in Telangana: తెలంగాణలో చలి పంజా విసురుతోంది. ఈశాన్యం నుంచి గాలులు వీస్తుండటంతో.. గత పది రోజులుగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. శనివారం రాత్రి పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలలో 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిర్పూర్లో 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు సొనాలలో 8.5 ఉష్ణోగ్రతలు నమోదు. బేల 9.2, బజార్ హత్నూర్‌లో 9.3, పొచ్చెరలో 9.5,…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తీరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అటెండర్‌తో బూట్లు మోయించారనే ఆరోపణలు కలెక్టర్ భవేశ్ మిశ్రా ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్ 2023 సందర్భంగా స్థానిక చర్చిలో జరిగిన వేడుకలకు కలెక్టర్ భవేశ్ మిశ్రా బూట్లతోనే ప్రార్థన మందిరంలోకి వెళ్లారు. బూట్లతో ప్రార్థన మందిరంలోకి వెళ్లడం సరికాదని గ్రహించిన కలెక్టర్.. పక్కనే ఉన్న అటెండర్ దఫేదార్ చేతికి తన బూట్లను ఇచ్చారు. Also Read: Mulugu Bokka: మూలుగ బొక్క కోసం లొల్లి..…
Marriage was Cancelled for Mooluga Bokka in Telangana: ‘బలగం’ సినిమాలో మూలుగ బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య జరిగే గొడవ అందరికీ గుర్తుండే ఉంటుంది. పెళ్లి అనంతరం పండగకు అత్తారింటికి వచ్చిన అల్లుడికి మూలుగ బొక్క వేయకపోవడంతో బావ, బామ్మర్దుల మధ్య జరిగిన గొడవ.. ఆ కుటుంబంలో కలహాలకు దారి తీస్తుంది. అచ్చం అలాగే మూలుగ బొక్క కోసం జరిగిన గొడవ.. చిరవకు పెళ్లి సంబంధం రద్దు అయ్యే వరకు వెళ్లింది. ఈ…
CM Revanth Reddy meeting with Collectors and SP’s Today: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ భాద్యతలు చేపట్టిన అనంతరం మొదటిసారిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం నిర్వహించనున్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో నేడు జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడనున్నారు. ధరణి సమస్యలు, మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, కొత్త రేషన్ కార్డులు, ప్రజావాణి విజ్ఞప్తులు, దరఖాస్తులు, గ్రామ సభలు.. మొదలైన వాటిపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. సీఎంగా…
రోజుకు రోజుకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 1,322 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా పన్నెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో మూడింట రెండొంతులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో తొమ్మిది, వరంగల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదైనట్లు…
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. వర్సిటీ మహిళా హాస్టల్ లో చాప కింద నీరులా ర్యాగింగ్ భూతం విస్తరిస్తోంది. జూనియర్ విద్యార్థినిలపై సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఏకంగా 81 మంది స్టూడెంట్స్ ను వర్సిటీ అధికారులు హాస్టల్స్ నుంచి సస్పెండ్ చేశారు.
తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నర్సింహ రావు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ తో కలిసి అప్పుల్లో కూరుకుపోయిన భారత దేశాన్ని గాడిన పెట్టీ తన వంతు సేవ దేశానికి అందించారు.. పీవీ ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలి.. ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలి అని ఆయన డిమాండ్ చేశారు.