Hardik Pandya: భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్య కళ్లు చెదిరే క్యాచ్ పట్టి గ్రౌండ్‌లో దుమ్ములేపాడు. ఈ మ్యాచ్ మూడో బంతికి హార్దిక్ మిడ్-ఆఫ్‌లో డెవాన్ కాన్వే ఇచ్చిన అద్భుతమైన క్యాచ్‌ను సూపర్ హీరో రేంజ్‌లో గాల్లోకి దూకి పట్టుకున్నాడు. ఈ క్రమంలో పాండ్య ల్యాండింగ్ బాగా లేకపోయినా, బంతిని మాత్రం తన చేతిలో నుంచి వదిలిపెట్టలేదు.
READ ALSO: Magha Purnima : మాఘ పూర్ణిమ 2026.. శివకేశవుల అనుగ్రహం కోసం ఈ పవిత్ర రోజున ఏం చేయాలి.?
టాస్ గెలిచిన టీమిండియా – న్యూజిలాండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత బౌలర్ హర్షిత్ రాణా బౌలింగ్ ప్రారంభించగా.. మూడో బంతికి కాన్వే గాల్లో్కి లేపిన బంతి, మిడ్-ఆఫ్ లో నిలబడి ఉన్న హార్దిక్‌కు వచ్చింది. వెంటనే పాండ్య ఎడమవైపుకు అమాంతం గాల్లోకి దూకి, అద్భుతమైన మిడ్-ఎయిర్ క్యాచ్ సూపర్‌గా అందుకున్నాడు. అయితే క్యాచ్ తర్వాత పాండ్య బోల్తా పడ్డాడు, కానీ బంతిని మాత్రం వదలలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Excellent catch from Hardik Pandya 🏏🏏 pic.twitter.com/jeKTSOROIe
— Chandu 🚩 (@sheshu_chandu) January 25, 2026
READ ALSO: Gallantry Awards For 2026: భారత వైమానిక దళ గర్వకారణం.. శుభాన్షు శుక్లాను వరించిన అశోక్ చక్ర!