దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు కలవరపెడుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రపంచాన్ని వణికిస్తోంది. కేరళలో తిష్ట వేసిన వెరియంట్ అన్ని రాష్ట్రాల్లో వ్యాపిస్తుంది. తెలంగాణలోనూ కరోనా మహమ్మారి మళ్లీ ప్రవేశించింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 6 కరోనా కేసులు నమోదయ్యాయి. 538 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి కరోనా వచ్చినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇంకా 42 మంది రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కరోనా కేసులు హైదరాబాద్ లోనే వెలుగుచూశాయని…
2024 జనవరిలో శ్రీరామ జన్మభూమి అయోధ్య రామమందిరం విగ్రహప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను కళ్లారా చూడటం కోసం ఎంతో మంది భక్తులు ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే.. అయోధ్యకు తెలంగాణ నుండి బీజేపీ ప్రత్యేక రైళ్లను నడపాలని చూస్తోంది. ప్రతి లోక్ సభ నియోజక వర్గం నుండి ఒక ట్రైన్ నడపనున్నట్లు తెలుస్తోంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒక రైలులో భక్తులను పంపించాలని బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. అందుకు రాష్ట్ర బీజేపీ…
కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులపై మాజీ మేయర్ రవీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కరీంనగర్ స్మార్ట్ సిటీ పనుల్లో నాణ్యతకు నిబంధనలకు నీళ్లు వదిలారు.. స్మార్ట్ సిటీ పనుల నిర్వహణకు, ప్రభుత్వానికి సంబంధం ఉండదు.. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయాలు తీసుకుంటారు.
Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. శీతాకాల విడిది కోసం సోమవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు.