Coronavirus: కరోనా అలజడి.. తెలంగాణలో కొత్తగా 9 పాజిటివ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి కరోనా అలజడి మళ్లీ మొదలైంది. కొవిడ్ కొత్త వెరియంట్ జేఎన్-1 కారణంగా క్రమంలో దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇక తెలంగాణలో సైతం కరోనా విజృంభిస్తోంది. కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ కొత్త కేసులతో కలిసి రాష్ట్రంలో 27 యాక్టివ్ కేసులు ఉన్నట్లు బులిటెన్‌లో వెల్లడించారు. అలాగే ఒకరు రికవరీ అయ్యారు. కాగా ఈ రోజు తెలంగాణలో 1245 మందికి కరోనా టెస్టులు నిర్వహించినట్టు ఆరోగ్య శాఖ పేర్కొంది.
Also Read: Coronavirus: కరోనా కలకలం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
అయితే తాజాగా నమోదైన తొమ్మిది కేసుల్లో 8 మంది హైదరాబాద్, ఒకరు రంగారెడ్డి జిల్లా నుంచి ఉన్నారు. ఇంకా 68 మంది రిపోర్ట్స్ పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉంది. నిలోఫర్‌లో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా, ఆ పాపకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మరోవైపు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎంసీ వైరాలజీ ల్యాబ్‌లో ఆరు శాంపిల్స్ ఆర్‌టీపీసీటీ టెస్ట్ పంపగా.. రెండు పాజిటివ్‌గా వచ్చాయి. దీంతో భూపాలపల్లి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుస్తు చర్యల్లో భాగంగా జిల్లా కేంద్రంలో 100 పడకల కరోనా వార్డు ఏర్పాటు చేశారు.
Also Read: Rashmika Mandanna: ఎట్టకేలకు బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రష్మిక..
తాజావార్తలు
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..