Covid Cases: తెలంగాణాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు..ఒక్కరోజులో ఎన్నంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా కరోనా మళ్లీ మృత్యువు గంట మొగిస్తుంది.. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.. ఒమెక్రాన్ కొత్త వేరియంట్ జెఎస్.1 కలకలం రేపుతోంది. చాపకింద నీరులా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది.. నిన్నటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 29 ఉండగా ఈరోజు మళ్లీ పెరిగింది.. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 30 కి పైగా చేరింది.. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందులో దాదాపు 10 మందికి పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది..
రంగారెడ్డిలో ఒకరికి కోవిడ్ సోకింది. నిలోఫర్ ఆస్పత్రిలో రెండు నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. కరోనా కేసులు అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.. పదేళ్ల లోపు చిన్నారులకు,60 ఏళ్లు పైబడిన వారికి తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు..
Also Read
ఇక ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పని సరిగా ధరించాలని ఆదేశించింది. జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తే తక్షణమే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్దంగా ఉంచినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రికవరీ రేటు 99.51 శాతంగా ఉందని అధికారికంగా తెలిపారు.. ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాలను అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.. ఇతర రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తుంది..
తాజావార్తలు
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
-
Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
-
Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..
-
Vaibhav Sooryavanshi: వినోద్ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!
-
Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!